కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ముంబయిలో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల జాతీయ సమావేశం


వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, విజయవంతమైన కార్యక్రమాలపై సదస్సులో చర్చ

నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన కీలక చర్యల పురోగతిపై సమీక్ష

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 12:40PM by PIB Hyderabad

మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముంబయిలో సెప్టెంబర్‌ 11, 12 తేదీల్లో భవనఇతర నిర్మాణ కార్మికుల (బీఓసీడబ్ల్యూకోసం కేంద్ర కార్మికఉపాధి మంత్రిత్వ శాఖ జాతీయ సదస్సును నిర్వహించనుందికేంద్ర కార్మికఉపాధి శాఖ-యువజన వ్యవహారాలుక్రీడలశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన ఈ సదస్సు జరగనుందికేంద్ర కార్మికఉపాధి-సూక్ష్మచిన్నమధ్య తరహా పరిశ్రమలశాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజేవివిధ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల కార్మికశాఖ మంత్రులుఉన్నతాధికారులుబీఓసీడబ్ల్యూ సంక్షేమ బోర్డుల చైర్‌పర్సన్లుకార్యదర్శులుకేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటారు.

దేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పించే రంగాల్లో నిర్మాణ రంగం ఒకటిగా ఉంటూ.. లక్షలాది మంది కార్మికుల జీవనోపాధికి ఆధారంగా నిలుస్తోందికొత్త కార్మిక చట్టాల అమలుతో మారుతున్న బీఓసీడబ్ల్యూ వ్యవస్థను సమీక్షించేందుకుసంక్షేమ బోర్డుల పనితీరును మరింత బలోపేతం చేసేందుకు ఈ సదస్సు కీలక వేదికగా నిలవనుందిచట్టపరమైన బాధ్యతలుకార్మికుల నమోదుసంక్షేమ పథకాల అమలుసంక్షేమ నిధుల పర్యవేక్షణవినియోగం వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారువివిధ శాఖలుసంస్థల మధ్య సమన్వయం పెంపొందించడంసాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సేవలను అందించడంలో ఉన్న అవకాశాలనూ పరిశీలించనున్నారు.

రాష్ట్రాల బీసీఓడబ్ల్యూ సంక్షేమ బోర్డులు అమలు చేస్తున్న వినూత్న విధానాలువిజయవంతమైన కార్యక్రమాలను సదస్సులో పంచుకోనున్నారునిర్మాణ కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగాసమర్థవంతంగా అందేలా.. ఇతర రాష్ట్రాలు కూడా వీటిని అనుసరించి అమలు చేయగల ఉత్తమ విధానాలను గుర్తించేందుకు ఈ చర్చలు దోహదపడనున్నాయి.

2025 నవంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ప్రారంభించిన మూడు ప్రధాన కార్యక్రమాలైన రాష్ట్ర బీఓసీడబ్ల్యూ డిజిటల్‌ లేబర్‌ చౌక్‌లేబర్‌ చౌక్‌-ఫెసిలిటేషన్‌ సెంటర్లుఆన్‌లైన్‌ బీఓసీడబ్ల్యూ సెస్‌ వసూలు వేదికల పురోగతిని ఈ సదస్సులో సమీక్షించనున్నారుఈ కార్యక్రమాల ద్వారా కార్మికులకు ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడంవారికి గౌరవప్రదమైనసులభంగా అందుబాటులో ఉండే సేవలు అందించడంసెస్‌ వసూలుపర్యవేక్షణలో పారదర్శకతసామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అంతర్జాతీయ కార్మిక చలనశీలత మార్గాలునైపుణ్యాభివృద్ధిఉపాధి అవకాశాలుకార్మిక గణాంకాలులేబర్‌ స్టాక్‌ వంటి అంశాలపై కూడా చర్చించనున్నారుకేంద్రంరాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలుబీసీఓడబ్ల్యూ సంక్షేమ బోర్డుల మధ్య మరింత సమన్వయం పెంచడంఅమలులో ఉన్న లోపాలను గుర్తించడంనిర్మాణ కార్మికులకు సామాజిక భద్రతసంక్షేమంఉపాధి అవకాశాలు మరింత సమర్థవంతంగాసులభంగా అందేలా ప్రాధాన్యతా చర్యలను రూపొందించడం ఈ సదస్సు లక్ష్యం.

 

***


(రిలీజ్ ఐడి: 2308257) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati