ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరివర్తనను తెచ్చేది జ్ఞానమే... ఓ సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 10:46AM by PIB Hyderabad

సమాజంతో సద్భావనను కలిగి ఉండే కళను జ్ఞానం నేర్పిస్తుందని ప్రస్తావిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారుజ్ఞానంతో వివేకాన్నీధనాన్నీ పొందవచ్చునుజ్ఞానం.. మనసును ఆనందంతో నింపివేస్తుందిఫలితంగా వ్యక్తి ఆత్మగౌరవం పెంపొందుతుందని ప్రధానమంత్రి అన్నారు.

‘‘ఉపదిశతి లోకవృత్తం వితరతి విత్తం వినోదయతి చిత్తమ్

ఉత్తమ్భయతి మహత్త్వం విద్యా హృద్యా సురాజసేవేవ’’ అన్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.

సమాజంతో సద్భావనను కలిగివుంటూ జీవించే కళను విద్య నేర్పుతుందిఈ జ్ఞానమే వివేకాన్నీధనాన్నీ అందిస్తుందివ్యక్తి మనసును సంతోషంతో నింపివేయడంతో పాటువ్యక్తి ఆత్మగౌరవాన్ని కూడా పెంపొందిస్తుందిఈ కారణంగా సుపరిపాలన అందజేసే సేవ మాదిరిగానే విద్య కూడా చాలా విలువైందీమనసు ప్రేమించేదీజీవన స్థాయిని పెంపొందింప చేసే శక్తిగా చెప్పవచ్చని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘ఉపదిశతి లోకవృత్తం వితరతి విత్తం వినోదయతి చిత్తమ్

ఉత్తమ్భయతి మహత్త్వం విద్యా హృద్యా సురాజసేవేవ’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2308232) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam