ప్రధాన మంత్రి కార్యాలయం
జ్ఞానానికి ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 7:51AM by PIB Hyderabad
జ్ఞానానికి సంబంధించిన ఏ శాఖ నుంచి అయినా సరే.. అది చిన్నది గాని లేక పెద్దది గాని.. వివేకం గల వారు, బుద్ధిమంతులు దాని సారాన్ని గ్రహించాలని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ప్రతి మూలం నుంచి విలువైన జ్ఞానాన్ని వ్యక్తి పొంది, మనసులోకి తీసుకోవాలని అవసరం ఎంతయినా ఉందని ఆయన స్పష్టం చేశారు.
‘‘అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యః కుశలో నరః, సర్వతః సారమాద్యాత్ పుష్పేభ్య ఇవ షట్పదః’’ అన్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.
ఒక తేనెటీగ ప్రతి ఒక్క పుష్పం నుంచి తేనెను సంగ్రహించిన మాదిరిగానే వివేకి, బుద్ధిమంతుడు జ్ఞానాన్ని ఏ శాస్త్రం నుంచి అయినా సరే, అది చిన్న శాస్త్రం కావచ్చు, లేదా పెద్ద శాస్త్రం కావచ్చు.. దానిలోని సారాన్ని గ్రహించాలి. అలాగే, ఏ మూలాన్నుంచి అయినా అత్యంత విలువైన జ్ఞానాన్ని వ్యక్తి పొంది, దానిని మనసు లోపలకు తీసుకోవాలని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యః కుశలో నరః, సర్వతః సారమాద్యాత్ పుష్పేభ్య ఇవ షట్పదః’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2307742)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam