రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణ దళాల కోసం సుమారు రూ.1.10 లక్షల కోట్ల మూలధన సమీకరణ ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 07 SEP 2026 4:15PM by PIB Hyderabad

రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సెప్టెంబర్ 07, 2026న జరిగిన రక్షణ సేకరణ మండలి (డీఏసీసమావేశంలో దాదాపు రూ.1,10,000 కోట్ల అంచనా వ్యయంతో రక్షణ దళాల వివిధ సమీకరణ ప్రతిపాదనలకు అవసరాన్ని అంగీకరించి (ఏఓఎన్అంటే... తాత్కాలిక పరిపాలనాపరమైన ఆమోదం లభించిందిఇందులో భాగంగా భారత సైన్యం కోసం రసాయనజీవరేడియోలాజికల్అణు (సీబీఆర్ఎన్శోధన వాహనాలుహై మొబిలిటీ వెహికల్స్ (హెచ్ఎంవీ), సెల్ఫ్-ప్రొపెల్డ్ మెకానికల్ మైన్ లేయర్స్ (ఎంఎంఎల్), తేలికపాటి అత్యాధునిక హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్), యుద్ధ ట్యాంకులుసర్వత్రా బ్రిడ్జ్ సిస్టమ్ కొనుగోలుకు ఆమోదం లభించింది.

సీబీఆర్ఎన్ ఏజెంట్లతో కలుషితమైన ప్రాంతాలను కనిపెట్టేందుకువిశ్లేషించటానికిపర్యవేక్షించటానికిగుర్తించటానికి వీలుగా సీబీఆర్ఎన్ శోధన వాహనాలుంటాయికఠినమైన భూభాగాల్లో కార్యాచరణ సామర్థ్యాలనురవాణా మద్దతునుచలనశీలతను హెచ్ఎంవీలు మెరుగుపరుస్తాయిఎంఎంఎల్‌లు కావలసిన కార్యాచరణ సామర్థ్యాన్ని అందిస్తాయిభారత సైన్య వైమానిక దళం కోసం అన్ని భూభాగాల్లోకార్యాచరణ పరిస్థితుల్లో సంక్లిష్టమైన మిషన్‌లను ఏఎల్‌హెచ్‌లు నిర్వహిస్తాయివివిధ భూభాగాల్లో ఆపరేషన్ల సమయంలో యుద్ధ విభాగానికి సంయుక్త మార్గాలను అందించేందుకు యుద్ధ ట్యాంకులుబ్రిడ్జ్ సిస్టమ్ ఉపయోగపడతాయి.

భారత నౌకాదళం కోసం ఆరుద్ర రాడార్ల సేకరణసముద్ర గ్యాస్ టర్బైన్ల (ఎంజీటీరూపకల్పనఅభివృద్ధికి ఏఓఎన్ ఆమోదం లభించిందివివిధ నేవల్ ఎయిర్ స్టేషన్లలో ప్రస్తుతమున్న ఎయిర్ రూట్ నిఘా రాడార్ల స్థానాన్ని ఆరుద్ర రాడార్ భర్తీ చేస్తుందియుద్ధనౌక ప్రొపల్షన్ వ్యవస్థ అయిన ఎంజీటీ ద్వారా విదేశీ సరఫరాదారులపై ఆధారపడటం తగ్గుతుంది.

భారత వైమానిక దళం కోసం యుద్ధ విమానాలురవాణా విమానాలుహెలికాప్టర్ల ద్వారా యుద్ధ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన వివిధ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందిగ్రౌండ్-బేస్డ్ మల్టీ-పర్పస్ జామర్ జీబీఎంపీజే)ను కొనుగోలు చేసేందుకుడిఫెన్స్ ఫోర్సెస్ సెక్యూర్ యాక్సెస్ కార్డ్ (డీఈఎఫ్ఎస్ఏసీవ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కూడా ఆమోదం లభించిందిశత్రు రాడార్లకు వ్యతిరేకంగా సమర్థవంతమైన జామింగ్‌ను జీబీఎంపీజే అందిస్తుందిప్రస్తుతమున్న కాగితం ఆధారిత గుర్తింపు కార్డులుపాసులుపర్మిట్ల స్థానంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత స్మార్ట్‌కార్డ్ వ్యవస్థను డీఈఎఫ్ఎస్ఏసీ ప్రవేశపెడుతుంది.

మంజూరైన మొత్తం ఏఓఎన్‌ల్లో సుమారు 98 శాతం భారత పరిశ్రమల నుంచే కొనుగోళ్లు జరుగుతాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2307611) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil , Kannada