ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శాంతి, శ్రేయస్సు, ప్రకృతితో సద్భావనల కోసం ప్రార్థనలు ముఖ్యం..

ఓ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 SEP 2026 9:43AM by PIB Hyderabad

శాంతి, సుఖ సంతోషాలు, ప్రకృతితో సద్భావన నెలకొల్పడానికి ప్రార్థనలు ముఖ్యమని చాటుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘శం నో వాతః పవతాం శం నస్తపతు సూర్యః

శం నః కనిక్రదద్ దేవః పర్జన్యోభివర్షతు’’ అని పేర్కొన్నారు.

‘మన కోసం గాలి శాంతంగా, ఆరోగ్యవర్ధకంగా, పరిశుద్ధంగా వీయునుగాక. సూర్య కిరణాలు మన సంక్షేమానికి, ఆశీర్వాదానికి మూలంగా మారి, మన పైన ప్రసరించుగాక. వాటి వెచ్చదనం, వెలుగు మనకు సుఖాన్ని, ఆనందాన్ని ప్రసాదించుగాక. వరుణ దేవుడు ‘పర్జన్యుడు’ మనకు ప్రాణశక్తి ప్రదాయకమూ, మంగళకరమూ అయిన వానలను కురిపించుగాక’ అనే సందేశాన్ని పైన ప్రస్తావించిన సుభాషితం మనకు అందిస్తున్నది.

 

***


(రిలీజ్ ఐడి: 2307360) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam