ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో సత్య నికేతన్‌లో భవనం కూలి ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 06 SEP 2026 8:24PM by PIB Hyderabad

ఢిల్లీలో సత్య నికేతన్‌లో ఓ భవనం కూలిన ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని తెలిపారు.

 

ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. అధికారులు ఘటన స్థలంలో చురుకుగా పనిచేస్తున్నారనీ, ఘటనతో ప్రభావితులైన వారికి సహాయాన్ని అందిస్తున్నారనీ ఆయన అన్నారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా తెలిపింది:

 

‘‘ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఓ భవనం కూలిన ఘటన బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన వారికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు ఘటన స్థలంలో పనిచేస్తున్నారు. ఘటనతో ప్రభావితులైన వారికి సహాయాన్ని అందిస్తున్నారు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’.

 

***


(రిలీజ్ ఐడి: 2307358) సందర్శకుల సూచీ సంఖ్య : : 7