బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరిశుభ్రత, సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యాల మెరుగుదల కోసం ప్రత్యేక ప్రచారం-6.0ని ప్రారంభించిన ఈసీఎల్

నాడు పోస్టు చేయడమైనది: 04 SEP 2026 5:27PM by PIB Hyderabad

సంస్థ వ్యాప్తంగా కార్యాలయ పరిశుభ్రతను మెరుగుపరచడంసుస్థిరతను ప్రోత్సహించడంకార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ... భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలుప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో ‘వ్యర్థాల నుంచి సంపద’బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఇ-వ్యర్థాల నిర్వహణ’ అనే అంశాల కింద ప్రత్యేక ప్రచారం-6.0ను ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్సంస్థ ప్రారంభించింది.

 

 

నాలుగు కీలక రంగాలైన ఇ-వ్యర్థాల నిర్వహణపెండింగ్‌ను తగ్గించడంస్థల వినియోగాన్ని మెరుగుపరచడండిజిటలైజేషన్ ద్వారా ఇ-వ్యర్థాల సమర్థ సేకరణవిభజనడిస్పోజల్ ప్రక్రియలపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుందిదీనికోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రెండు దశల్లో అమలు చేయనున్నారుసన్నాహక దశను ఈ నెల 15 నుంచి 30 వరకుఆ తర్వాతి అమలు దశను అక్టోబర్ నుంచి 31 వరకు చేపట్టనున్నారు.

ఈ ప్రచారాన్ని ఈసీఎల్ సంస్థ సీఎండీ శ్రీ సతీష్ ఝా అధికారికంగా ప్రారంభించారుఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ ఝా మాట్లాడుతూ... ప్రత్యేక ప్రచారం-6.0 లక్ష్యాలను సాధించడంలో సమష్టి భాగస్వామ్య ప్రాముఖ్యతను స్పష్టం చేశారుప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం చురుకైనఅర్థవంతమైన సహకారం అందించాలని ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు.

 

 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డైరెక్టర్ (ఫైనాన్స్శ్రీ మహమ్మద్ అన్జర్ ఆలండైరెక్టర్ (హెచ్‌ఆర్శ్రీ గుంజన్ కుమార్ సిన్హాడైరెక్టర్ (టెక్నికల్/పి&పిశ్రీ గిరీష్ గోపినాథన్ నాయర్డైరెక్టర్ (టెక్నికల్/ఆపరేషన్స్శ్రీ చిత్రరంజన్ కుమార్ఈ ప్రత్యేక ప్రచారం-6.0 నోడల్ ఆఫీసర్ శ్రీ నజ్రుల్ ఇస్లాంజనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్లతో పాటు ప్రధాన కార్యాలయం నుంచి హెచ్‌ఓడీలువివిధ ప్రాంతాల జనరల్ మేనేజర్లూ హాజరయ్యారు.

ప్రత్యేక ప్రచారం-6.0 కింద ఎలక్ట్రానిక్ వ్యర్థాల క్రమబద్ధమైన సేకరణవిభజనబాధ్యతాయుత పరిశుభ్రత కోసం 'ఈ రోజు చర్య తీసుకోండిరేపు ప్రభావం చూపండిఅనే నినాదంతో ఈసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతోందిపార్లమెంట్ సభ్యులురాష్ట్ర ప్రభుత్వాలు సహా వివిధ భాగస్వాముల నుంచి అందిన ఫిర్యాదుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రజా ఫిర్యాదులుఅప్పీళ్లుసూచనలుసమాచారాలను సకాలంలో పరిష్కరించేందుకు చేసే ప్రయత్నాలనూ ఇది బలోపేతం చేస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2306834) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil