ఆయుష్
azadi ka amrit mahotsav

ఆయుర్వేద దినోత్సవానికి ముందు ‘ఆయుర్‌వార్తా’ డిజిటల్ చర్చా పరంపరను ప్రారంభించిన ఏఐఐఏ


ఈ నెల 23వ తేదీని ఆయుర్వేద దినోత్సవంగా ఖరారు చేయడానికి ఉన్న ప్రాధాన్యాన్ని
ప్రస్తావించనున్న ఒకటో ఎపిసోడ్

నాడు పోస్టు చేయడమైనది: 01 SEP 2026 6:09PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వశాఖలో ఓ భాగంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న స్వయంప్రతిపత్తి సంస్థ అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థ’(ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద.. ఏఐఐఏ). ఈ సంస్థ ‘ఆయుర్‌వార్తా’ [AyurVarta] ను ప్రారంభించింది. ఇది డిజిటల్ మాధ్యమంలో వరుసగా సాగుతూ ఉండే ఓ విశిష్ట చర్చా కార్యక్రమం. ఆయుర్వేదానికి సంబంధించిన ప్రామాణిక జ్ఞానం, విజ్ఞానశాస్త్ర దృష్టికోణాలు, సమకాలీన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఆయుర్వేదానికి ఉన్న సందర్భశుద్ధి.. వీటిని దేశ విదేశాల్లో జనబాహుళ్యం చెంతకు చేర్చడం ‘ఆయుర్‌వార్తా’ కార్యక్రమ లక్ష్యం.
ఈ నెల 23న ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అంతకు ముందే, పైన ప్రస్తావించిన  ‘ఆయుర్‌వార్తా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ‘ఆయుర్‌వార్తా’ చర్చా పరంపరలో ఆయుర్వేద, ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లు, విజ్ఞానశాస్త్ర సంబంధ పరిశోధనలు, విద్య, చికిత్స పద్ధతులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద‌కు ప్రాసంగికత అంతకంతకు విస్తరిస్తుండడంతో ముడిపడిన అంశాలపై నిపుణులతో మాటామంతీని నిర్వహించనున్నారు.
ఏఐఐఏకు చెందిన డైరెక్టరు ప్రొఫెసర్ (వైద్య) పి.కె. ప్రజాపతితో పాటు డీన్, ప్రొఫెసర్ (డాక్టర్) మహేశ్ వ్యాస్ మధ్య జరిగిన చర్చ కార్యక్రమంతో  ‘ఆయుర్‌వార్తా’ తొలి ఎపిసోడ్‌‌ను రూపొందించారు. వీరు ఇద్దరూ ‘‘ఆయుర్వేద దినోత్సవాన్ని సెప్టెంబరు 23నే ఎందుకు నిర్వహించాలి?’’ అనే విషయంపై చర్చలో పాల్గొన్నారు.
చర్చలో.. ‘ఆయుర్వేద దినోత్సవ’ పరిణామ క్రమ ప్రస్తావన ఉంది. దీనిని ఇంతకు ముందు ధన్వంతరి జయంతి (ధన్‌తేరస్’గా పాటిస్తూ రావడం, ప్రతి ఏటా ఒక నిర్దిష్ట తేదీన ఆయుర్వేద దినోత్సవాన్ని జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గురించిన వివరాలు కూడా చర్చలో ప్రస్తావనకు వచ్చాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుర్వేదాన్ని ఒక ముఖ్య జ్ఞానంగా, ఆరోగ్యసంరక్షణ వ్యవస్థగా బలోపేతం చేయడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రపంచమంతటా ఆరోగ్య రంగంలో ఆయుర్వేదానికి సందర్భశుద్ధి రోజు రోజుకూ పెంపొందుతోందని ఏఐఐఏ డైరెక్టరు ప్రొఫెసర్ (వైద్య) పి.కె. ప్రజాపతి అన్నారు.
ఒక నిర్దిష్టమైన రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని పాటించడం వల్ల దీని వార్షిక నిర్వహణకు మరింత ఎక్కువ నిరంతరత్వం లభించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో దీనికి ఒక బలమైన గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు.
ఈ దృష్టికోణాన్నిడిజిటల్ మాధ్యమంలోకి విస్తరించే ప్రయత్నమే  ‘ఆయుర్‌వార్తా’. దీని ద్వారా ఆయుర్వేద తాలూకు ప్రామాణిక జ్ఞానాన్ని, నిపుణుల దృష్టికోణాలను ప్రజలకు వివరిస్తారని కూడా ప్రొఫెసర్ ప్రజాపతి తెలిపారు.
చర్చలో ప్రొఫెసర్ (డాక్టర్) మహేశ్ వ్యాస్ సెప్టెంబరు 23కున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ఆ రోజున ప్రకృతిలో శరత్కాల విషువత్తు సంభవిస్తుందని, ఆ రోజున సూర్య కిరణాలు భూ మధ్య రేఖపై నిటారుగా పడటం వల్ల ప్రపంచమంతటా పగలు, రాత్రి దాదాపు సమానంగా ఉంటాయని ఆయన గుర్తుచేశారు.
ఆయుర్వేదం పరంగా మనుషుల ఆరోగ్యాన్ని, శ్రేయస్సును అర్థం చేసుకోవడంలో సంతులనం, సామంజస్యం అనేవి కీలక అంశాలు అవుతాయని ప్రొఫెసర్ (డాక్టర్) మహేశ్ వ్యాస్ వివరించారు. ఈ కారణంగా ఆయుర్వేదంలో సంతులనం, సామంజస్యం, సమత్వంపై ఆధారపడిన దృక్పథంతో కూడా సెప్టెంబరు 23ను జోడించవచ్చని ఆయన అన్నారు.
ఆయుర్వేదకు చెందిన వివిధ పార్శ్వాలపై నిరంతర ప్రాతిపదికన , సాధికారిక చర్చకు ఉద్దేశించిన డిజిటల్ వేదికగా  ‘ఆయుర్‌వార్తా’ను రూపొందిస్తారు. ఈ చర్చా పరంపరలో భారత్‌తో పాటు విదేశాలకు చెందిన ఆయుర్వేద నిపుణులు, వైద్యులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విధాన నిపుణులు పాల్గొననున్నారు.
‘ఆయుర్‌వార్తా’ భావి ఎపిసో‌డ్‌లలో అనేక అంశాలపై చర్చలు చోటు చేసుకోనున్నాయి. వాటిలో:
     • ఆయుర్వేదకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు, ఆధునిక కాలంలోని పరిశోధనలు
     •   ఆయుర్వేద విద్య, యువతరం పాత్ర
     •   ఆయుర్వేద, ప్రజారోగ్యం
     •   ఆయుర్వేదంలో నూతన ఆవిష్కరణలు, సాంకేతికత
     •   ఆయుర్వేద, ఆధునిక వైద్య విజ్ఞానశాస్త్రాల మధ్య సమన్వయం
     •   ఔషధ మొక్కలు, ప్రాకృతిక వనరులు
     •   ఆరోగ్యవంతమైన జీవనశైలులు, నివారణ ప్రధాన ఆరోగ్యసంరక్షణ సేవలు
     •   ఆయుర్వేదం, అంతర్జాతీయ ఆరోగ్య సరళి
     •   అంతర్జాతీయ స్థాయిలో ఆయుర్వేద విస్తరణకు ఉన్న అవకాశాలు
     •   ఆయుర్వేదంలో పరిశోధన, ఫలితాలపై ఆధారపడిన చికిత్స.. వంటివి కొన్ని.
‘ఆయుర్‌వార్తా’ ఎపిసోడ్‌లను ఏఐఐఏ ఆధికారిక డిజిటల్, సామాజిక మాధ్యమ వేదికల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తారు. వాటిలో యూట్యూబ్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టా‌గ్రామ్ కూడా ఉంటాయి. దీని ద్వారా ఆయుర్వేదానికి సంబంధించిన ప్రామాణిక, శాస్త్రీయ సమాచారాన్ని విద్యార్థులు, యువజనులు, డాక్టర్లు, పరిశోధకులు, విద్యావేత్తలతో పాటు సామాన్య ప్రజానీకం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని చేపడుతున్నారు.
‘ఆయుర్‌వార్త’ ఒకటో ఎపిసోడ్ చూడటానికి ఈ కింది యూట్యూబ్ లింకులో అందుబాటులో ఉంది:
Watch ‘AyurVarta’ – First Episode on YouTube

 

***


(రిలీజ్ ఐడి: 2305859) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi