రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణ దళాల్లో తొలి (వైద్యేతర) మహిళా టూ-స్టార్ అధికారిగా చరిత్ర సృష్టించిన ఏవీఎం శక్తి శర్మ

నాడు పోస్టు చేయడమైనది: 01 SEP 2026 6:01PM by PIB Hyderabad

భారత వైమానిక దళ చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టం నమోదైందిఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ భారత రక్షణ దళాల్లో ఎయిర్ వైస్ మార్షల్ (తత్సమానహోదాను పొందిన తొలి మహిళా అధికారిణి (వైద్యేతర విభాగంఅయ్యారు. 01 సెప్టెంబర్ 2026ఆమె ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)గా బాధ్యతలు స్వీకరించారు.

 

1994 జూన్ 18న ఐఏఎఫ్ విద్యా విభాగానికి నియమితులైన ఏవీఎం శక్తి శర్మ... శిక్షణ సంస్థలుఫీల్డ్ స్టేషన్లుకమాండ్ హెడ్ క్వార్టర్స్ఎయిర్ హెడ్ క్వార్టర్స్ వంటి విభిన్న బాధ్యతల్లో పనిచేసిన అపార అనుభవంతో ఈ నూతన బాధ్యతలు చేపట్టనున్నారుతన కెరీర్ మొత్తంలో విద్యావ్యూహాత్మక రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి ఐఐటీ కాన్పూర్పూణే విశ్వవిద్యాలయంలో ఐఏఎఫ్ చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన సహాకీలకమైన సంస్థాగత కార్యక్రమాలకూ ఆమె నాయకత్వం వహించారుకపుర్తలాలోని సైనిక్ పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూత్రివిధ దళాల నుంచి ఒక సైనిక్ పాఠశాలను కమాండ్ చేసిన తొలి మహిళా అధికారిగానూ ఆమె చరిత్ర సృష్టించారు.

 

ఈ చరిత్రాత్మక విజయం భారత రక్షణ దళాల మహిళా అధికారుల ప్రస్థానంలో నూతన అధ్యాయానికి నాంది పలికిందిమూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలు అందించిన ఆమె... "అత్యున్నత శక్తిసామర్థ్యాలుఅచంచల సంకల్పంతో భారత గగనతలాన్ని రక్షించాలనే కర్తవ్యం"తో తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2305849) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil