ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఎంఎల్సీ ద్వారా విశాఖపట్నంలో ఆర్ఐఎన్ఎల్ కు చెందిన 459 భూభాగాల ఈ - వేలం

పారదర్శక విధానం ద్వారా హెచ్‌బి కాలనీ, ఆటో నగర్‌లలో విస్తరించి ఉన్న 93,572.21 చదరపు గజాల అత్యంత విలువైన భూముల ఈ - వేలం

నాడు పోస్టు చేయడమైనది: 01 SEP 2026 7:11PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి (డీపీఈచెందిన కేంద్ర ప్రభుత్వ పూర్తి యాజమాన్య సంస్థ… నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎంఎల్సీఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ -  ఆర్ఐఎన్ఎల్)  చెందిన వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన భూముల ఈ-వేలాన్ని ప్రకటించింది.

మొత్తం 93,572.21 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 459 భూభాగాల (ల్యాండ్ పార్శిల్స్ను ఎలాంటి వివాదాలుహక్కు దావాలు  లేని  (ఎన్‌కంబరెన్స్-ఫ్రీప్రభుత్వ టైటిల్స్ తో పూర్తిస్థాయి విక్రయం  కోసం ప్రతిపాదిస్తున్నారుఇందులో వ్యక్తిగత ప్లాట్ల పరిమాణం సుమారు 128.94 చదరపు గజాల నుంచి 2,728 చదరపు గజాల వరకు ఉందిఈ వేలం ప్రక్రియను సులభతరం చేసేందుకు క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (క్యూఐపీఎల్ను  ట్రాన్సాక్షన్ కన్సల్టెంట్‌గా నియమించారు

వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన భూముల వివరాలు

  • హెచ్‌బి కాలనీమద్దిలపాలెంఅన్ని రకాల పౌరసామాజిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందిన పట్టణ నివాస ప్రాంతంలో... 456 నివాస ఎంఐజి/ఎల్ఐజి  ప్లాట్లు ఉన్నాయిఈ స్థలాలకు 24 నుంచి 60 అడుగుల కాంక్రీట్ ప్రవేశ రహదారులు ఉండటమే కాకుండాఇవి జాతీయ రహదారి 16  కి అత్యంత సమీపంలో ఉన్నాయి.

  • ఆటో నగర్గాజువాకబ్లాక్ లో జాతీయ రహదారి 16 కి 0.5 కిలోమీటర్ల దూరంలో వాణిజ్యరవాణాఅవసరాలకు అనువుగా ఉండే 2,728 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన అత్యంత విలువైన స్థలంతో పాటుబ్లాక్ లో రెండు నివాస ప్లాట్లు ఉన్నాయి.

పారదర్శక ఈ-వేలం ప్రక్రియ

పోటీతత్వంతో కూడిన ఈ బిడ్డింగ్ ప్రక్రియను రైల్టెల్ ఈ నివిద ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్‌ఫామ్‌పై రెండు విడతలుగా…  2026 అక్టోబర్ 12, 2026 అక్టోబర్ 16 తేదీలలో నిర్వహించనున్నారు

ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి గల బిడ్డర్లు నిర్దేశిత గడువులోగా అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్కేవైసీ పూర్తి చేయాలిప్లాట్‌కు రూరెండు లక్షల చొప్పున నిర్ణయించిన అడ్వాన్స్ మనీ డిపాజిట్ సమర్పించాలి.

-వేలం పోర్టల్ఆర్ఎఫ్‌పీ వివరాలు: https://eauction.enivida.com

ప్రభుత్వ ఆస్తుల విలువ నిర్ధారణ

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలుప్రభుత్వ ఏజెన్సీల వద్ద ఉన్న అదనపు భూములుఇతర ఆస్తులకు క్రమబద్ధమైనపారదర్శకమైన విధానం ద్వారా నగదు విలువ (మోనిటైజ్కట్టే ఎన్ఎల్ఎమ్సీ ప్రధాన లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందిఈ డిజిటల్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అర్హులైన పెట్టుబడిదారులుడెవలపర్లువ్యక్తిగత భాగస్వాములకు విశాఖపట్నంలో అభివృద్ధి చెందినప్రధాన ప్రాంతాల్లో ఉన్న  ఆస్తులను సురక్షితంగా సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎంఎల్సీగురించి

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలుప్రభుత్వ విభాగాలు/సంస్థల వద్ద ఉన్న అదనపు భూములుసాధారణ ఆస్తులకు మానిటైజేషన్ నిర్వహించేందుకు  ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగం కింద ఏర్పాటైన 100% భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ నేషనల్ ల్యాండ్ మోనిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎంఎల్సీ).

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్గురించి

కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోరాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కింద పనిచేస్తున్న నవరత్న సంస్థవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్.


***


(రిలీజ్ ఐడి: 2305837) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi