బొగ్గు మంత్రిత్వ శాఖ
పరిశుభ్రత, సామర్ధ్యానికి కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ ప్రత్యేక ప్రచారం 6.0 కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ సన్నాహక సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 6:46PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశుభ్రతా ప్రచారం 6.0 కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ కస్సీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), దాని అనుబంధ సంస్థలు, ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సీసీఓ), కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్ఓ)లకు చెందిన నోడల్ అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక పరిశుభ్రతా ప్రచారం 6.0 గురించి సమావేశంలో సంపూర్ణ అవగాహన కల్పించారు. ప్రచారం ప్రధాన లక్ష్యాలు, ప్రాధాన్య అంశాలు, అమలు వ్యూహాన్ని వివరిస్తూ విస్తృత ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రత్యేక పరిశుభ్రతా ప్రచారం 5.0 సందర్భంగా బొగ్గు మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు, అమలు చేసిన ఉత్తమ విధానాలను కూడా అధికారులకు వివరించారు. ప్రత్యేక పరిశుభ్రతా ప్రచారం 6.0లో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలు, నిర్దేశించిన ప్రాధాన్యతలపై నోడల్ అధికారులకు అవగాహన కల్పించారు.

ఈ-వ్యర్థాలను సమర్థవంతంగా సేకరించడం, వేరు చేయడం, సక్రమంగా పారవేయడం, కార్యాలయ ప్రాంగణాలను మెరుగుపరచడం, ఆధునిక పారిశుద్ధ్య విధానాలను అవలంబించడం, స్క్రాప్‌ను సమర్థవంతంగా పారవేయడం, కార్యాలయ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడం, డిజిటలీకరణ, పర్యావరణహిత విధానాలను ప్రోత్సహించడం, వ్యర్థాలను సంపదగా మార్చడం, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడం, పౌరుల అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చే విధానాలను అవలంబించడం; సంస్థాగత ప్రోటోకాల్స్, వ్యవస్థలను మరింత పటిష్ఠం చేయడం మొదలైన అంశాలపై ప్రత్యేక పరిశుభ్రతా ప్రచారం 6.0లో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ప్రత్యేక పరిశుభ్రతా ప్రచారం 5.0పై పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్పీజీ) విడుదల చేసిన మదింపు నివేదిక ప్రకారం, అందుబాటులోకి వచ్చిన కార్యాలయ స్థల విస్తీర్ణం పరంగా బొగ్గు మంత్రిత్వ శాఖ మొదటి స్థానాన్ని, ఆదాయం సమకూర్చిన విషయంలో మూడో స్థానాన్ని సాధించింది. ప్రత్యేక పారిశుద్ధ్య ప్రచారం 5.0ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా పరిశుభ్రత, పర్యావరణ సుస్థిరత, వనరుల సమర్థ నిర్వహణ పట్ల బొగ్గు మంత్రిత్వ శాఖ తన నిరంతర నిబద్ధతను చాటుకుంది. గత ప్రచారంలో సాధించిన విజయాలు ప్రత్యేక పరిశుభ్రతా ప్రచారం 6.0ను మరింత విజయవంతంగా, ప్రభావవంతంగా అమలు చేసేందుకు బలమైన పునాదిని అందిస్తున్నాయి.
ప్రచార కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంతోపాటు పరిశుభ్రత, కార్యాలయాల సామర్థ్యం, సకాలంలో పెండింగ్ అంశాల పరిష్కారం, సమగ్ర పరిపాలనా సామర్థ్యంపై స్పష్టమైన, సానుకూల ప్రభావాన్ని తీసుకురావాలన్న బొగ్గు మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ సన్నాహక సమావేశం పునరుద్ఘాటించింది. కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన, మరింత సమర్థవంతమైన, సువ్యవస్థిత కార్యాలయ వాతావరణాన్ని సృష్టించడంపై నిరంతరం దృష్టి సారిస్తూ, బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2305833)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10