ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రికి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం “ఒలియ్ దరజాలి దోస్తిలిక్”
నాడు పోస్టు చేయడమైనది:
30 AUG 2026 5:50PM by PIB Hyderabad
ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ షవ్కత్ మిర్జియోయేవ్ నేడు ఆ దేశ అత్యున్నత విదేశీ పౌర పురస్కారం “ఒలియ్ దరజాలి దోస్తిలిక్” (అత్యున్నత మైత్రీ పురస్కారం)ను నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి ప్రధాని చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. విదేశీ నాయకులకు ఉజ్బెకిస్తాన్ అందించే అత్యున్నత గౌరవం ఇదే.
ఈ గౌరవాన్ని స్వీకరించిన ప్రధాని శ్రీ మోదీ.. ఈ పురస్కారాన్ని 140 కోట్ల భారతీయ ప్రజలకు అంకితం చేశారు. ఇరు దేశాలు, సంస్కృతుల మధ్య కొనసాగుతున్న చిరకాల స్నేహానికి ఈ అవార్డు నిదర్శనమని పేర్కొన్నారు. అధ్యక్షుడు మిర్జియోయెవ్ తనపై కురిపించిన ప్రశంసలు.. భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహానికి, ఉమ్మడి వారసత్వానికి నివాళి అని తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వాములుగా ఉజ్బెకిస్థాన్‌తో కలిసి పనిచేసే అదనపు బాధ్యతను ఈ గౌరవం భారత్‌పై నిలిపిందని ఆయన పేర్కొన్నారు.
“ఒలియ్ దరజాలి దోస్తిలిక్” పురస్కార ప్రదానం రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సాంస్కృతిక సంబంధాలను, క్రమంగా విస్తరిస్తున్న భారత్-ఉజ్బెకిస్తాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2304790)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8