జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామీణాభివృద్ధి కోసం సమన్వయం

వీబీ-జీ రామ్ జీ చట్టం కింద జేజేఎమ్ 2.0, ఎస్‌బీఎమ్-జీ 2.0 పనులనూ అనుసంధానించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన డీడీడబ్ల్యూఎస్

నాడు పోస్టు చేయడమైనది: 27 AUG 2026 6:47PM by PIB Hyderabad

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సహకారంతో, జల్ శక్తి మంత్రిత్వశాఖకు చెందిన తాగునీరు-పారిశుధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్)... 'వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్ జీ) చట్టం-2025' కింద 'జల్ జీవన్ మిషన్ (జేజేఎం) 2.0', 'స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఎస్‌బీఎం-(జీ) 2.0' పనులనూ అనుసంధానించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ అనుసంధాన ప్రక్రియ... గ్రామీణాభివృద్ధి బలోపేతం, గ్రామీణ నీటి భద్రత, అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడం లక్ష్యంగా చేపట్టిన ఒక కీలక కార్యక్రమం.

సుస్థిర జీవనోపాధి, వ్యవసాయ ఉత్పాదకత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, దీర్ఘకాలిక గ్రామీణాభివృద్ధి కోసం నీటి భద్రత ప్రాముఖ్యతను గుర్తిస్తూ... వీబీ-జీ రామ్ జీ చట్టం-2025 దానిని తన నాలుగు ప్రధానాంశాల్లో ఒకటిగా పేర్కొంది. 10 మార్చి 2026న ఆమోదించిన జల్ జీవన్ మిషన్ (జేజేఎం) 2.0... విశ్వసనీయమైన, పటిష్ఠమైన గ్రామీణ తాగునీటి సేవలను అందించడానికి, తాగునీటి వనరుల సుస్థిరత, భూగర్భ జలాల పునరుజ్జీవనం, గ్రేవాటర్ నిర్వహణను తన వ్యూహంలో ప్రధానాంశాలుగా ఉంచింది. ఎస్‌బీఎం (జీ) 2.0... పర్యావరణ పారిశుధ్యాన్ని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఘన, ద్రవ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై దృష్టి సారిస్తుంది. ఈ కార్యక్రమాల పరస్పర ప్రయోజనకరమైన లక్ష్యాలు, వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల (వీజీపీపీల) ద్వారా సమీకృత ప్రణాళిక, అమలుకు అవకాశాన్ని కల్పిస్తాయి.

అనుసంధాన ప్రణాళికలో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కింది అభ్యర్థనలు చేశారు -

సరైన సమగ్ర ప్రణాళికను నిర్ధారించండి.

వీజీపీపీల కింద నీటి భద్రతకు ప్రాధాన్యమివ్వండి.

చట్టం కింద ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలో గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం ఇన్‌చార్జి అధికారిని చేర్చండి.

సమన్వయ కార్యకలాపాల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణను సులభతరం చేయడానికి... రాష్ట్ర జల-పారిశుధ్య మిషన్, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి ప్రత్యేక నోడల్ అధికారులను, సంబంధిత నోడల్ అధికారులతో నామినేట్ చేయండి.

జేజేఎం 2.0, ఎస్‌బీఎం-జీ 2.0 కింద గ్రామ కార్యాచరణ ప్రణాళికలతో వీజీపీపీలను సాంకేతికంగా అనుసంధానించాలి.

జేజేఎం 2.0, ఎస్‌బీఎం-జీ 2.0 కింద గల అన్ని పనులను, ఇతర అనుసంధానిత ఆస్తులను వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్‌లో నమోదు చేసి, జియో-ట్యాగ్ చేయాలి.

రాష్ట్రాలు నీటి బడ్జెటింగ్, హైడ్రోజియోలాజికల్ అంచనాలతో పాటు... యుక్తధార వంటి జియోస్పేషియల్ ప్రణాళిక సాధనాలను ఉపయోగించుకోవాలి.

వీబీ-జీ-రామ్ జీ, జేజేఎం 2.0, ఎస్‌బీఎం-జీ 2.0 కింద పెట్టుబడులు సమష్టిగా సుస్థిర తాగునీటి భద్రతకు, మెరుగైన గ్రామీణ జీవనోపాధికి దోహదపడేలా అనుసంధానాన్ని సంస్థాగతం చేయాలి.

దీనిని విజయవంతంగా అమలు చేయడం కోసం రాష్ట్ర, జిల్లా, గ్రామ పంచాయతీ స్థాయిల్లోని తాగునీరు-పారిశుధ్యం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఇతర సంబంధిత శాఖల మధ్య సన్నిహిత సమన్వయం అత్యంత కీలకం. ఇటువంటి సమన్వయం గ్రామీణ తాగునీటి సేవల సుస్థిరతను బలోపేతం చేయడంతో పాటు... పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ 'వికసిత్ భారత్ @2047' లక్ష్య సాధనకూ దోహదపడుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2303973) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी