మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఉపాధ్యాయ దినోత్సవం రోజున 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు 2026 సంవత్సరానికి జాతీయ పురస్కారాలు ప్రదానం చేయనున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
21 AUG 2026 10:15PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2026 సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. పురస్కార గ్రహీతల అద్భుతమైన కృషిని వివరిస్తూ రూపొందించిన లఘు డాక్యుమెంటరీలను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు.
విద్యా మంత్రిత్వశాఖలోని పాఠశాల విద్య-అక్షరాస్యత విభాగం ప్రతి యేటా ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 5) సందర్భంగా... కఠినమైన, పారదర్శకమైన, ఆన్‌లైన్ ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపికైన దేశంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేయడానికి ఒక జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయుల విశిష్టమైన కృషిని గుర్తించి, గౌరవించడం... తమ నిబద్ధత, కృషి ద్వారా పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరుస్తూ, విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేసిన ఉపాధ్యాయులను సత్కరించడం ఈ జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల ముఖ్య ఉద్దేశం.
జాతీయ ఉపాధ్యాయ అవార్డులు-2026 కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ఆన్‌లైన్ స్వీయ నామినేషన్లను ఆహ్వానించారు. దీని కోసం 15.06.2026 నుంచి 20.07.2026 వరకు విద్యా మంత్రిత్వ శాఖ పోర్టల్ http://nationalawardstoteachers.education.gov.in ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సంవత్సరం, పాఠశాల విద్య-అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నిర్వహించిన మూడు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా మొత్తం 48 మంది పాఠశాల ఉపాధ్యాయులు పురస్కారానికి ఎంపికయ్యారు. వీరు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు సహా కేంద్ర ప్రభుత్వానికి చెందిన 6 విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరిలో 26 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు.
ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన స్వయం ప్రభ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. https://webcast.gov.in/moe లోనూ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ సోషల్ మీడియా ఛానెళ్లలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
ఏదైనా నిర్ధిష్ట మెరిట్ క్రమం పాటించకుండా రూపొందించిన పురస్కార గ్రహీతల జాబితా కింది విధంగా ఉంది.
పాఠశాల విద్య-అక్షరాస్యత విభాగం ప్రకటించిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు -2026
|
Sl.No.
|
Name
|
State / UT of Org
|
School Name & Address
|
|
1
|
SHRI J PRAKASH RAO
|
A AND N ISLANDS
|
PM SHRI GMSSS MAYABUNDER, POKADERA
|
|
2
|
SHRI RAJESH KOULURI
|
ANDHRA PRADESH
|
MPPS CHINAMALLUPETA, CHINAMALLUPETA
|
|
3
|
MS. YAKU TAME
|
ARUNACHAL PRADESH
|
GOVERNMENT SECONDARY SCHOOL G-SECTOR NAHARLAGUN, PAPUMAPRE DISTRICT. ARUNACHAL PRADESH, WARD NO. 16
IMC
|
|
4
|
SHRI RAJESH BORDOLOI
|
ASSAM
|
ADARSHA TRIBAL HIGHER SECONDARY SCHOOL, JORHAT, KALBARI
|
|
5
|
MS. KHUSHBOO KUMARI
|
BIHAR
|
URDU PRIMARY SCHOOL BIDAYDIH, BIDAYDIH
|
|
6
|
MS. PUSHPA PRASAD
|
BIHAR
|
MIDDLE SCHOOL KUCHAIKOTE KANYA, KUCHAIKOTE
|
|
7
|
MS. RADHA RAJESH
|
C.I.S.C.E.
|
NEW HORIZON PUBLIC SCHOOL, INDIRANAGAR
|
|
8
|
MS. SANGEETA YADAV
|
CBSE
|
ST. JOSEPH'S CONVENT SR SEC SCHOOL, WARD NO 8 IDGAH HILLS
|
|
9
|
SHRI RAVI JAISWAL
|
CHANDIGARH
|
GOVT. MODEL HIGH SCHOOL MALOYA COLONY
CHANDIGARH, MALOYA COLONY
|
|
10
|
MS. SUNITA YADAV
|
CHHATTISGARH
|
GOVT M S KHICHARI, KHICHARI
|
|
11
|
MS. PATEL PURNIMA MOHANLAL
|
DADRA AND NAGAR HAVELI AND DAMAN AND
DIU
|
GHS DALWADA, DALWADA
|
|
12
|
MS. SUMAN GOEL
|
DELHI
|
GSKV POOTH KALAN, POOTH KALAN
|
|
13
|
MD. ZAFAR ALAM
|
Eklavya Model Residential Schools under Ministry of
Tribal Affairs
|
EMRS KARANJIA, BINURIA (TATO)
|
|
14
|
SHRI MAHADEV HANAMANT SHINDE
|
GOA
|
GUJARATI SAMAJ-SPECIAL SCHOOL, AQUEM
|
|
15
|
SHRI NITINKUMAR MAHENDRAKUMAR PATHAK
|
GUJRAT
|
RANGPUR PRIMARY
SCHOOL, RANGPUR
|
|
16
|
SHRI ANIL KAUSHIK
|
HARYANA
|
GMSSSS SANGHI ROHTAK, SANGHI
|
|
17
|
MS. MANJARI V MAHAJAN
|
HIMACHAL PRADESH
|
GOVERNMENT SENIOR SECONDARY SCHOOL, BHALETH, BHALETH
|
|
18
|
MOHD AYAZ RAINA
|
JAMMU AND KASHMIR
|
HSS DALHORI, DALHORI
|
|
19
|
MS. MUNMUN BHATTACHERJEE
|
JHARKHAND
|
MS BARMASIA, BARMASIA
|
|
20
|
MS. RATHNAKUMARI S
|
KARNATAKA
|
GOVERNMENT HIGHER PRIMARY SCHOOL SAMATAGARU,
HONNEBAILU
|
|
21
|
MS. AMUTHA J
|
Kendriya Vidyalaya Sangathan
|
PM SHRI KENDRIYA VIDYALAYA NO 2 MADURAI, MADURAI
|
|
22
|
DR. MANISHA KHETRAPAL
|
Kendriya Vidyalaya Sangathan
|
PM SHRI KV NFR RANGIYA, RANGIA
|
|
23
|
SHRI SUNIL KUMAR KP
|
KERALAM
|
GHSS IRIKKUR, IRIKKUR
|
|
24
|
SHRI MOHD MUSTAFA KUMAL
|
Ladakh
|
GOVT. MIDDLE SCHOOL ZGANGJING, SANKOO, KANOOR
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|
25
|
DR. ARCHANA SHUKLA
|
MADHYA PRADESH
|
GOVT. MAHATMA GANDHI SANDIPANI HR. SEC SCHOOL BHEL BHOPAL,
BHEL BHOPAL
|
|
26
|
SHRI SHAILENDRA PRATAP SINGH
|
MADHYA PRADESH
|
GOVERNMENT MIDDLE SCHOOL KANJWAR, VILLAGE KANJWAR POST PONDI JODOURI BLOCK
MAJHAULI DISTRICT SIDHI MADHYA PRADESH
|
|
27
|
DR. KAVITA NARSINGRAO GITTE
|
MAHARASHTRA
|
SANE GURUJI NIVASI VIDYALAYA KAIJ, SANE GURUJI NIWASI MADHYAMIK VIDYALAYA
KAIJ DHARUR ROAD KAIJ
|
|
28
|
MS. KUNDA JAYAWANT BACHHAV
|
MAHARASHTRA
|
NMC SCHOOL NO.18, ANANDWALII, NASHIK, MAHARASHTRA,
ANANDWALLI
|
|
29
|
SHRI WANGLEMBAM GOBIN SINGH
|
MANIPUR
|
LAIKON UPPPER PRIMARY SCHOOL, KONGBA MAKHA NANDEIBAM LEIKAI
|
|
30
|
MS. LALNUNMAWII
|
MIZORAM
|
GOVERNMENT ELECTRIC VENG HIGH SCHOOL, ELECTRIC VENG
|
|
31
|
SHRI R RONALD MERU
|
NAGALAND
|
GHSS SECHU ZUBZA, SECHU
|
|
32
|
SHRI VAIBHAV VASANTRAO KULKARNI
|
Navodaya Vidyalaya Samiti
|
PM SHRI SCHOOL JAWAHAR NAVODAYA VIDAYALAYA LATUR, 12 NO. PATI NEAR
MANJARA SUGAR FACTORY BARSHI ROAD
|
|
33
|
SHRI PADARAJ UMAKANTA NAYAK
|
ODISHA
|
GOVERNMENT HIGH SCHOOL ALIPINGAL, ALIPINGAL
|
|
34
|
SHRI GANESAN S
|
|
VIDUTHALAI VEERAR R
|
|
PUDUCHERRY
|
SEENUVASAN GOVERNMENT HIGH SCHOOL, METTUPALAYAM
|
|
35
|
SHRI DINESH KUMAR
|
PUNJAB
|
GOVT VICTORIA GIRLS SENIOR SECONDARY SCHOOL PATIALA, PATIALA
|
|
36
|
DR DIVYENDU SEN
|
RAJASTHAN
|
MAHATMA GANDHI GOVERNMENT SCHOOL PACHPAHAR, PACHPAHAR
|
|
37
|
DR VARTIKA GULAT
|
|
***
(रिलीज़ आईडी: 2302317)
आगंतुक पटल : 3