ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026’లో తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
21 AUG 2026 10:33PM by PIB Hyderabad
ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ 2026లో చేసిన తన ప్రసంగంలోని విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు.
“భారత్ ఉత్పత్తి ఆధారిత శిక్ష విధానం నుంచి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల దిశగా మారింది.
ఒకప్పుడు నిర్దేశించిన పరిమితికి మించి ఉత్పత్తి చేస్తే కంపెనీలకు జరిమానాలు విధించేవారు. లైసెన్స్ రాజ్ విధానంలోని ఆ ఆలోచనా ధోరణి వ్యాపారాలను, ఉత్పత్తిని, ఉద్యోగాల కల్పనను నిరుత్సాహపరిచింది.
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేలా ప్రోత్సహిస్తున్నాం, పారిశ్రామికవేత్తలపై విశ్వాసం ఉంచుతున్నాం.
భారత్ వ్యాపారాలను నియంత్రించే విధానం నుంచి వాటిని ప్రోత్సహించే విధానం వైపు అడుగులు వేసింది.”
“భారత్ సంస్కరణల ప్రయాణంలో పాలనా తత్వంలో వచ్చిన మార్పే కీలకం.
‘అనుమతి ఇచ్చే వరకు నిషేధం’ అనే విధానం నుంచి ‘నిషేధించనంత వరకు అనుమతి’ అనే విధానం వైపు మనం పయనిస్తున్నాం.
జన విశ్వాస్, నేరాల డీక్రిమినలైజేషన్, వేలాది అనుసరణ నిబంధనల తొలగింపు, కాలం చెల్లిన అనేక చట్టాల రద్దు ద్వారా ప్రజలు, వ్యాపార సంస్థలపై భారాన్ని తగ్గిస్తున్నాం.”
“విధానాలు ప్రజానుకూలంగా, వృద్ధికి అనుకూలంగా, అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి’’
“అత్యంత అర్థవంతమైన అనేక సంస్కరణలు ప్రజల రోజువారీ జీవితంలో భాగమయ్యేవే. ఇదే ‘జీవన సౌలభ్యానికి’ నిజమైన అర్థం…”
(रिलीज़ आईडी: 2302314)
आगंतुक पटल : 5