యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్’: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్’ దృష్టికోణం నుంచి స్ఫూర్తిని పొందిన

ఓ నూతన అంతర్జాతీయ యువ అనుసంధాన ఆధారిత కార్యక్రమం

గాంధీనగర్‌లో ‘2026 బ్రిక్స్ యువ శిఖరాగ్ర సమావేశం’ సందర్భంగా ఈ మేరకు ప్రకటించిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే

प्रविष्टि तिथि: 19 AUG 2026 7:53PM by PIB Hyderabad

‘మై భారత్’ (MY Bharat) ద్వారా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ప్రపంచమంతటా భారతీయ మూలాలున్న యువజనులతో తన అనుబంధాన్ని బలోపేతం చేసుకొంటోంది. దీనిలో భాగంగా ‘ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్’ పేరుతో ప్రత్యేక డిజిటల్ మాడ్యూల్‌ను ప్రారంభించారు. గాంధీనగర్‌లో ‘2026 బ్రిక్స్ యువ శిఖరాగ్ర సమావేశాన్ని’ నిర్వహించిన సందర్భంగా, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.



ఇది భారత్‌కు వెలుపల నివసిస్తున్న భారతీయ మూలాలున్న విద్యార్థులు, యువ వృత్తినిపుణులు, తదితర యువతకు వారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నారన్నది పట్టించుకోకుండా ‘మై భారత్’ వేదికగా నిర్వహించే జాతి నిర్మాణ కార్యకలాపాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, యువత నేతృత్వం వహించే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. వారి ఆలోచనలను, నైపుణ్యాలను, అనుభవాలను, ఆకాంక్షలను భారతదేశ అభివృద్ధి ప్రస్థానం దిశగా మళ్లించాలన్నదే దీని లక్ష్యం.



ఈ కార్యక్రమంలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవీ, పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ హేమాంగ్ జోషీ, యువజన వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శ్రీ నితేశ్ కుమార్ మిశ్రా‌, బ్రిక్స్ తో పాటు భాగస్వామ్య దేశాల యువ నేతలు పాల్గొన్నారు.



ఈ మాడ్యూల్ ప్రపంచవ్యాప్తంగా భారతీయ యువజనులకు ‘ఫ్రెండ్ ఆఫ్ మై భారత్’గా నమోదు చేసుకొనేందుకు, తమ యువజన క్లబ్బులు లేదా సంఘాల కార్యకలాపాలతో పాటు అనుబంధ రంగాలు సహా వాటిని గురించిన సమాచారాన్ని పంచుకొనేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. దీనికి అదనంగా ఇది విద్య, పర్యావరణం, ఆరోగ్య సంబంధిత చైతన్యం, విపత్తుల వేళల్లో సహాయక చర్యలతో పాటు సాంస్కృతిక పరిరక్షణ వంటి రంగాల్లో స్వచ్ఛంద సేవలను అందించేందుకు వివిధ అవకాశాల తాలూకు సమాచారాన్ని కూడా అందిస్తుంది. దీంతో యువతకు దేశంలో అమలవుతున్న వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకొనేందుకు అవకాశాలు లభిస్తాయి.



ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘నో యువర్ ఇండియా’ (మీ భారత్‌ను గురించి తెలుసుకోండి) విభాగం భారతదేశ సంస్కృతి, వారసత్వం, చరిత్ర, పర్యటన, ప్రయాణ, ప్రముఖ నేతలను గురించి రూపొందించిన కంటెంటు ద్వారా దేశంతో ప్రపంచం నలు మూలలా భారతీయ యువత  అనుబంధాన్ని విస్తరింప చేసుకోవడంలో తోడ్పాటును అందించనుంది. ‘మై భారత్’‌కు సంబంధించిన ప్రధాన కార్యక్రమాలతో పాటు జాతీయ ప్రాధాన్యం కలిగిన కార్యక్రమాలను కూడా ఈ మాడ్యూల్ కళ్లకు కడుతుంది. దీంతో భారత్‌కు చెందిన యువత నాయకత్వంలో అభివృద్ధి ప్రస్థానానికి సంబంధించి చైతన్యం విస్తరించడమే కాకుండా, సమగ్ర అంతర్జాతీయ భాగస్వామ్యానికీ ప్రోత్సాహం లభిస్తుంది.
ఒక నిరంతర అంతర్జాతీయ విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)ను నిర్మించే దిశగా తీసుకున్న కీలక నిర్ణయమే ‘ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్’. ఇది భారతీయ మూలాలు ఉన్న యువజనులను భారత్‌తో జతపడి ఉండేందుకు, తాము ప్రపంచంలో ఏ మూలన ఉన్నప్పటికీ భారత్ పురోగతికి తోడ్పాటును అందించేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ‘వికసిత్ భారత్’ను సాకారం చేసే దిశగా సాగించే ప్రస్థానంలో వివిధ దేశాల భారతీయ యువత శక్తికీ, ఆలోచనలకీ, నైపుణ్యాలకీ, ఆకాంక్షలకీ భాగస్వామ్యాన్ని కల్పించాలన్నదే దీని ఉద్దేశం.
‘మై భారత్‌’ను గురించి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 అక్టోబరు 31న ప్రారంభించిన ‘మేరా యువ భారత్’ (ఎమ్‌వై భారత్) ఒక జాతీయ స్థాయి వేదిక.  సేవ, కర్తవ్యం, ప్రజల భాగస్వామ్యం ప్రధానాంశాలుగా దీనిని రూపొందించారు. ఇది అనుభవాల నుంచి నేర్చుకొనేందుకు, స్వచ్ఛందంగా సేవలను అందించేందుకు, నైపుణ్యాలను అభివృద్ధిపరుచుకొనేందుకు, నాయకత్వం వహించేందుకు, మార్గదర్శనం పొందేందుకు, జాతీయ ప్రచార ఉద్యమాలలో పాల్గొనేందుకు యువతకు అవకాశాలను అందిస్తుంది. దీంతో వారు విషయాలను నేర్చుకొని, నేతృత్వం వహించగలుగుతారు. ‘2047 కల్లా వికసిత్ భారత్’ ఆశయాన్ని నెరవేర్చడంలో తమ వంతు పాత్రను నిర్వహించగలుగుతారు.

 

***


(रिलीज़ आईडी: 2301469) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Telugu , Urdu , हिन्दी