సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
విజయవాడలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర
प्रविष्टि तिथि:
13 AUG 2026 6:25PM by PIB Vijayawada
విజయవాడ నగరంలో దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఘనంగా త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు. 17వ ఆర్మీ బెటాలియన్ ఆధ్వర్యంలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) సహకారంతో నిర్వహించిన ఈ ర్యాలీలో భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ యన్ సీసీ క్యాడెట్లు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
NQ90.jpeg)
విజయవాడ సిటీ పోస్టాఫీస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల మీదుగా గాంధీ హిల్ వరకు కొనసాగింది. సుమారు 200 అడుగుల పొడవైన జాతీయ జెండాను ర్యాలీలో ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత మాతా కీ జై, వందేమాతరం నినాదాల మధ్య భారీ జాతీయ పతాకాన్నిఎన్ సీసీ కేడెట్లు పట్టుకుని చేసిన యాత్రను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావనను మరింత బలోపేతం చేయడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమరంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై మువ్వన్నెల జెండాలను ఎగురవేసి 80వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడమే కాకుండా,150వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ‘వందే మాతరం’ స్ఫూర్తికి అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో 17వ ఆర్మీ బెటాలియన్ పరిధిలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన త్రివిధ దళాల యన్ సిసి క్యాడెట్లు, ఎన్ సీసీ అధికారులు, ఆర్మీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2299143)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English