సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీఐసీ ద్వారా పరిష్కారమైన కేసులకు సంబంధించిన మీడియా నివేదిక వాస్తవ స్థితి


మీడియా నివేదికలో పేర్కొన్న మూడు కేసులకు వ్యతిరేకంగా ఆగస్టు 12 వరకు సీఐసీ పరిష్కరించిన కేసులు 768

प्रविष्टि तिथि: 13 AUG 2026 4:12PM by PIB Hyderabad

ఆగస్టు-2026లో సెకండ్ అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన మీడియా వార్తను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) పరిగణలోకి తీసుకుని, వాస్తవ స్థితిని ప్రజలకు తెలియజేయటం అవసరమని భావించింది.

వార్తా కథనంలో పేర్కొన్నట్లుగా ఆగస్టు 2026లో కేసుల పరిష్కారానికి సంబంధించి చూపిన సంఖ్యలు... ఆగస్టు 12 వరకు కమిషన్ సాధించిన వాస్తవ కేసుల పరిష్కారాన్ని ప్రతిబింబించవు. ఆగస్టు నెలలో కేవలం మూడు అప్పీళ్లు మాత్రమే పరిష్కారమైనట్లు వార్తలు వచ్చాయి. కానీ, వాస్తవానికి ఆగస్టు 12 నాటికి కమిషన్ 768 కేసులను పరిష్కరించింది. పరిష్కారమైన కేసులకు సంబంధించిన నిర్ణయాలను కూడా సంబంధిత పార్టీలకు పోస్టు ద్వారా పంపుతున్నారు.

కమిషన్ కు సంబంధించిన సెకండ్ అప్పీళ్లు, ఫిర్యాదుల పోర్టల్‌ను ఆగస్టు 2, 2026 నుంచి నవీకరిస్తున్నారు. దీనివల్ల పోర్టల్ నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యే కేసుల డేటా ఆగస్టు 1, 2026 వరకు మాత్రమే అప్‌డేట్ అయింది. ఈ పోర్టల్ నవీకరణకు సంబంధించిన సమాచారాన్ని జూలై 24, 2026న కమిషన్ వెబ్‌సైట్, సెకండ్ అప్పీళ్లు, ఫిర్యాదుల పోర్టల్లో తెలియజేశారు.

పోర్టల్ డేటా అప్‌డేట్ కాకపోవటం వల్ల కమిషన్ పనితీరుపై, విచారణల నిర్వహణపై ఎలాంటి ప్రభావం పడలేదు. పోర్టల్ నవీకరణ సమయంలోనూ కమిషన్ విచారణలు కొనసాగాయి.

పోర్టల్ నవీకరణ సమయంలో వెబ్‌సైట్లో కనిపిస్తున్న గణాంకాలు ఆగస్టు 2026లో పరిష్కారమైన అసలైన కేసులను సూచిస్తున్నట్లుగా భావించవద్దని కమిషన్ స్పష్టం చేయాలనుకుంటోంది.

ఆర్టీఐ దరఖాస్తుదారులు, కమిషన్ ఆన్‌లైన్ సేవలను ఉపయోగించే ఇతర భాగస్వాముల అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సెకండ్ అప్పీళ్లు, ఫిర్యాదుల పోర్టల్ నవీకరణ జరుగుతోంది. సెకండ్ అప్పీళ్లు, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారాన్ని పొందటానికి, నిర్వహించటానికి సమర్థవంతమైన, వినియోగదారులకు సులభంగా ఉండే డిజిటల్ వేదికను అందించేందుకు ఈ నవీకరించిన పోర్టల్.

ఈ నవీకరణ వల్ల కమిషన్ వెబ్‌సైట్, పోర్టల్‌లో కేసులకు సంబంధించిన సమాచారాన్ని మరింత సమర్థవంతంగా అప్‌డేట్ చేయటానికి, అందుబాటులో ఉంచటానికి వీలవుతుంది. దీనివల్ల భాగస్వాములు కేసుల గురించిన తాజా సమాచారాన్ని సులభంగా పొందవచ్చు.

నవీకరించిన సెకండ్ అప్పీళ్లు, ఫిర్యాదుల పోర్టల్ ఆగస్టు 17, 2026 నుంచి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఆ తర్వాత సంబంధిత కేసు డేటాను కమిషన్ వెబ్‌సైట్, పోర్టల్‌లో అప్‌డేట్ చేస్తారు.

పారదర్శకతకు, దాని కార్యకలాపాలకు సంబంధించిన ఖచ్చితమైన, సరిచూసుకోవాల్సిన సమాచారాన్ని అందించటానికి కమిషన్ కట్టుబడి ఉంది. నవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత కేసుల పరిష్కార డేటాను వెబ్‌సైట్, పోర్టల్ ద్వారా భాగస్వాములకు అందుబాటులో ఉంటుంది.

***


(रिलीज़ आईडी: 2299129) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Tamil