భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
పార్లమెంటు ప్రశ్న: ఎల్ నినో పరిస్థితులపై ముందస్తు సన్నాహాలు
प्रविष्टि तिथि:
05 AUG 2026 1:57PM by PIB Hyderabad
కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నైరుతి రుతుపవనాల వర్షపాతంపై ఎల్ నినో చూపించే ప్రభావాన్ని అంచనా వేసింది. సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన సమయంలో భారత నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే బలహీనంగా ఉంటాయి. అంతేకాకుండా ఎల్ నినో తీవ్రతను బట్టి వర్షపాతంపై దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. 1950 నుంచి ఇప్పటివరకు దేశంలో 16 ఎల్ నినో సంవత్సరాలు నమోదవ్వగా, అందులో 7 సంవత్సరాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే రుతుపవనాల కాలం రెండో భాగంలో (ముఖ్యంగా సెప్టెంబర్ నెల వర్షపాతంపై) ఎల్ నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంటోందని గణాంకాలు చూపుతున్నాయి.
ఐఎండీ క్రమం తప్పకుండా రుతుపవనాల కాలం, నెలవారీ వర్షపాతం, ఉష్ణోగ్రతల అంచనాలను విడుదల చేస్తుంది. దీనిలో భాగంగా 2026 నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ముందస్తుగా అంచనా వేసింది.తొలి విడత అంచనా ఏప్రిల్ 13, 2026న విడుదల చేసిన మొదటి విడత సుదీర్ఘకాల అంచనాలో, సీజనల్ వర్షపాతం దీర్ఘకాలిక సగటులో (ఎల్‌పీఏ) 92 శాతంగా నమోదు కావచ్చని (మోడల్ లోపం ±5 శాతంతో) ఐఎండీ అంచనా వేసింది. ఆ తర్వాత విడుదల చేసిన రెండవ విడత సుదీర్ఘకాల అంచనాలో ఈ వర్షపాతాన్ని దీర్ఘకాలిక సగటులో 90 శాతానికి (మోడల్ లోపం ±4 శాతంతో) తగ్గించింది. నైరుతి రుతుపవనాల సమయంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తన వాతావరణ హెచ్చరికల్లో ముందస్తుగా తెలిపింది. తద్వారా సంబంధిత రంగాలు, వ్యవసాయదారులు, ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవడానికి, ముందస్తు సన్నాహాలు చేసుకోవడానికి ఈ సమాచారం ఎంతో దోహదపడింది.
భారత వాతావరణ శాఖ ప్రతిరోజూలో రుతుపవనాల వర్షపాతంపై, ప్రతినెలా ఎల్ నినో పరిస్థితులపై క్రమం తప్పకుండా తాజా సమాచారాన్ని అందిస్తుంది. ఐఎమ్‌డీ జిల్లా, మండల స్థఆయిల్లో వర్షపాత వివరాలను సంబంధిత వర్గాలన్నింటికీ అందజేస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం, హోం మంత్రిత్వ శాఖ, వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు నిర్వహించే సమావేశాలలో పాల్గొంటూ అవసరమైన సమాచారాన్ని, సలహాలను అందిస్తుంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహించే పంట వాతావరణ పర్యవేక్షణ కింద ప్రతి వారం ఐఎండీ గడిచిన వర్షపాతం వివరాలను, అలాగే రాబోయే రెండు వారాల వర్షపాత అంచనాలను అందజేస్తుంది.
భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ఉష్ణమండల వాతావరణ పరిశోధన సంస్థ (ఐఐటీఎం) 2026 నాటి సీజనల్, స్వల్పకాలిక, మధ్యస్థకాలిక ప్రయోగాత్మక అంచనాల ఆధారంగా పనిచేస్తోంది. వర్షపాతం, అభివృద్ధి చెందుతున్న ఎన్సో (ఈఎన్ఎస్ఓ) ప్రభావాన్ని వ్యవసాయం, నీటి నిర్వహణకు ఎలా ఉపయోగించాలో పరిశీలిస్తూ వ్యవసాయ, ఆనకట్ట నిర్వహణ శాఖలతో కలిసి పనిచేస్తోంది.
2026లో ఎల్ నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు సంబంధించి జిల్లాల వారీగా ఎలాంటి ముప్పు, ప్రభావ అంచనా అధ్యయనం గానీ, ప్రత్యేక మార్గదర్శకాలను గానీ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు నేరుగా జారీ చేయలేదు.
కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత వాతావరణ శాఖ నిరంతరం వాతావరణ అంచనాలు, సీజనల్ వివరాలు, వర్షపాతం, వడగాలులు, ఇతర తీవ్రమైన వాతావరణ మార్పులకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంటుంది. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర విభాగాలకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి, తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది.
ఈ వివరాలను కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ నేడు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2294804)
आगंतुक पटल : 10