బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియ 15వ విడత, 13వ విడత రెండో ప్రయత్నాల్లో ఆరు బొగ్గు బ్లాకులకు విజయవంతంగా వేలం

प्रविष्टि तिथि: 04 AUG 2026 7:20PM by PIB Hyderabad

వాణిజ్య బొగ్గు గనుల వేలంలో భాగంగా నిర్వహించిన 15వ విడత, 13వ విడత రెండో ప్రయత్నం కింద కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆరు బొగ్గు బ్లాకులను విజయవంతంగా వేలం వేసింది. ఈ వాణిజ్య బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను 2026 ఏప్రిల్ 17న మంత్రిత్వశాఖ ప్రారంభించింది. అనంతరం 2026 ఆగస్టు 3 నుంచి 4 వరకు నిర్వహించిన ఆరోహణ వేలం (ఫార్వర్డ్ ఆక్షన్)లో ఈ ఆరు బొగ్గు బ్లాకులకూ వేలం ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ ఆరు బ్లాకుల్లో నాలుగు పూర్తిగా పరిశోధించినవి కాగా, రెండు పాక్షికంగా పరిశోధించినవి. ఈ బ్లాకులన్నింటిలో కలిపి దాదాపు 1,503.93 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా.. వీటి గరిష్ట వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 11.62 మిలియన్ టన్నులు.

వేలానికి సంబంధించి బ్లాకువారీ ఫలితాలు కింది విధంగా ఉన్నాయి:

 

ఈ ఆరు బ్లాకులు దాదాపు రూ.1,983.67 కోట్ల వార్షిక ఆదాయాన్ని సమకూర్చడంతోపాటు.. దాదాపు రూ. 1,743 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి15,710 ఉద్యోగాలను కల్పించే అవకాశముంది.

2020లో వాణిజ్య బొగ్గు గనుల తవ్వకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 147 బొగ్గు బ్లాకులను విజయవంతంగా వేలం వేశారు. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 377.974 మిలియన్ టన్నులు. ఈ గనులు అందుబాటులోకి వస్తే దేశీయ బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరగడమే కాకుండా.. బొగ్గు రంగంలో ఆత్మనిర్భరత సాధించాలన్న దేశ లక్ష్యానికి మరింత ఊతం లభిస్తుంది. ఈ బొగ్గు బ్లాకులన్నింటి ద్వారా ఏటా రూ. 48,215 కోట్ల మేర రాబడి వస్తుందనీ, అలాగే రూ. 54,315 కోట్ల మేర మూలధన పెట్టుబడులు సమకూరుతాయనీ అంచనా. అంతేకాకుండా బొగ్గు నిల్వలున్న ప్రాంతాల్లో ఇవి దాదాపు 4,89,552 ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.

దేశ ఆర్థిక వృద్ధికి బొగ్గు రంగాన్ని ప్రధాన చోదక శక్తిగా నిలిపేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కట్టుబడి ఉందన్న విషయాన్ని ఈ విజయాలు పునరుద్ఘాటిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీరుస్తూ- అదే సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా.. మరింత బలమైన, పటిష్టమైన, నిజమైన ఆత్మనిర్భర భారత్ సంకల్పాన్ని నెరవేర్చుకునే దిశగా మంత్రిత్వశాఖ పురోగమిస్తోంది.  

 

***


(रिलीज़ आईडी: 2294707) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी