భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026 జూలై 10 నాటికి పీఎం-ఈబస్ సేవా పథకం కింద దేశవ్యాప్తంగా 523 ఎలక్ట్రిక్ బస్సులు

प्रविष्टि तिथि: 04 AUG 2026 6:34PM by PIB Hyderabad

2026 జూలై 10 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 38,000 -బస్సులలో 27,555 -బస్సులు పీఎం-ఈబస్ సేవా-పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం (పీఎస్ఎంపథకంలో భాగంగా ఉన్నాయివీటిలో 10,000 -బస్సులు గృహనిర్మాణపట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌యూఏపీఎం-ఈబస్ సేవా పథకం కింద..  14,000 -బస్సులు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐపీఎంఈ డ్రైవ్ పథకం కింద.. 3,555 -బస్సులు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలురాష్ట్ర రవాణా సంస్థల (ఎస్‌టీయూకింద ఉన్నాయి.

2026 జూలై 10 నాటికి పీఎం-ఈబస్ సేవా–పీఎస్ఎం పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 523 -బస్సులను రంగంలోకి దించారుపీఎస్ఎం పథకం పరిధిలోకి వచ్చే ఎంఓహెచ్‌యూఏ అమలు చేస్తోన్న పీఎం-ఈబస్ సేవా పథకం కింద ఒడిశా రాష్ట్రానికి 400 -బస్సులను కేటాయించారుఅయితే 2026 ఆగస్టు నాటికి ఒక్క బస్సు కూడా సర్వీసులోకి రాలేదు

భారత్‌లో అధునాతన వాహన ఉత్పత్తుల (ఏఏటీతయారీ సామర్థ్యాలను పెంపొందించడం కోసం వాహనవాహన కాంపోనెంట్ పరిశ్రమ విషయంలో పీఎల్ఐ పథకాన్ని (పీఎల్ఐఆటో స్కీమ్) 2021 సెప్టెంబరు 23న రూ. 25,938 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ప్రభుత్వం ఆమోదించిందిఅన్ని రాష్ట్రాలలో పీఎల్ఐ-ఆటో పథకం అమలు పరిస్థితి కింది విధంగా ఉంది:


 

అంశం

31.03.2026 వరకు సంచిత వ్యయం

పెట్టుబడి (రూకోట్లు)

44,326

అదనపు అమ్మకాలు (ఆధార సంవత్సరం 2019-20 ఆర్థిక సంవత్సరం) (రూకోట్లు)

52,414

ఉపాధి కల్పన (సంఖ్య)

67,820

పంపిణీ చేసిన ప్రోత్సాహకం (రూకోట్లు)

2,386.36

ఫేమ్ ఇండియా పథకం రెండో దశ 2024 మార్చి 31తో విజయవంతంగా ముగిసిందిప్రస్తుతం ‘ఫేమ్-III’ పేరుతో ఎలాంటి పథకం అమల్లో లేనప్పటికీ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి పీఎంఈ డ్రైవ్ (పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు అందించటం కొనసాగుతోందిఈ పీఎం ఈ-డ్రైవ్ పథకం రూ. 10,900 కోట్ల మొత్తం బడ్జెట్‌తో 2024 సెప్టెంబరు 24న నోటిఫై అయింది

భారతీయ మూలధన వస్తు రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించే పథకం కింద భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 'ఇండస్ట్రీ 4.0'ని ప్రోత్సహించడానికి సమర్థ్ (స్మార్ట్ అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రాపిడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ హబ్కేంద్రాలను ఏర్పాటు చేసిందిఈ పథకం కింద ఎంహెచ్ఐ ఏర్పాటు చేసిన సమర్థ్ కేంద్రాల వివరాలు కింది విధంగా ఉన్నాయి:

  1. సెంటర్ ఫర్ ఇండస్ట్రీ 4.0 (సీ44) ల్యాబ్పుణె;

  2. ఐఐటీడీ-ఏఐఏ ఫౌండేషన్ ఫార్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ఐఐటీ ఢిల్లీ;

  3. -4.0 ఇండియాఐఐఎస్‌సీ బెంగళూరు;

  4. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డెమోడెవలప్‌మెంట్ సెల్సీఎంటీఐ బెంగళూరు.

ఇంకా 2023 జనవరి నుంచి సమర్థ్ కేంద్రాలు సాధించిన పురోగతి వివరాలు:

  1. సందర్శించిన వ్యక్తుల సంఖ్య: 26,372

  2. శిక్షణ పొందిన వ్యక్తుల సంఖ్య: 33,751

  3. నిర్వహించిన కోర్సులుశిక్షణ కార్యక్రమాల సంఖ్య: 332

(): భారత మూలధన వస్తు రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించే పథకంఫేజ్ II కింద కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ సెంటర్ల సంఖ్యను పెంచే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏదీ లేదు.

 

***


(रिलीज़ आईडी: 2294641) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी