గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
డీడీయూ-జీకేవై 2.0 పురోగతిని సమీక్షించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
సకాలంలో అమలు సహా, డిజిటల్ సంస్కరణలూ చేపట్టాలని పిలుపు
కొత్త డిజిటల్ కార్యక్రమాలు, పౌర కేంద్రిత సంస్కరణలతో డీడీయూ-జీకేవై 2.0 అమలును వేగవంతం చేసిన ప్రభుత్వం
प्रविष्टि तिथि:
04 AUG 2026 7:45PM by PIB Hyderabad
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై) పథకం వివిధ జీవనోపాధి అవకాశాలు కల్పించడం... పేదరిక నిర్మూలన లక్ష్యంగా దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద అమలు చేస్తున్న పలు కార్యక్రమాల్లో ఒకటి. ఉద్యోగ కల్పనతో ముడిపడిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా గ్రామీణ యువతకు పలు నైపుణ్యాలకు సంబంధించి శిక్షణనివ్వడం, వారి సుస్థిర జీవనోపాధిని ప్రోత్సహించడం డీడీయూ-జీకేవై లక్ష్యం.
గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన సంచార్ భవన్‌లో ఈ రోజు డీడీయూ-జీకేవై అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి సంయుక్త కార్యదర్శి (గ్రామీణ నైపుణ్యాలు-II) శ్రీమతి ఎం.జి. జయశ్రీ, డైరెక్టర్ (నైపుణ్యాలు) శ్రీ సంతోష్ కె తివారీ, ఎన్ఐసి డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి దీపికా అగర్వాల్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
2014-15లో ప్రారంభమైన ఈ పథకం కింద మొత్తం 18.45 లక్షల మంది గ్రామీణ పేదలకు శిక్షణ అందించారు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో 12.35 లక్షల మంది వేతనంతో కూడిన ఉపాధిని పొందారు. ప్రాజెక్టు అమలు సంస్థల (పీఐఏల) ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా, పారదర్శకంగా మార్చడం కోసం 2025లో పథకం మార్గదర్శకాలను సవరించారు. డీడీయూ-జీకేవై 2.0 కోసం... పీఐఏ ఆన్‌బోర్డింగ్, ప్రాజెక్టు సమర్పణ, ప్రాజెక్టు మూల్యాంకనం, శిక్షణ కేంద్రం/బ్యాచ్/అభ్యర్థి నిర్వహణ, అంచనా, ధ్రువీకరణ, ఆర్థిక నిర్వహణ, ప్రాజెక్టు పర్యవేక్షణ, ఉద్యోగ కల్పన/ఉద్యోగ ట్రాకింగ్ మొదలైన శిక్షణ - ఉద్యోగ కల్పన దశలన్నింటినీ సులభతరం చేసే ఒక సమగ్ర డిజిటల్ పరిష్కారాన్ని అభివృద్ధి చేశారు.
డీడీయూ జీకేవై 2.0 పురోగతిని, కీలక డిజిటల్ సంస్కరణలనూ గౌరవ సహాయ మంత్రి సమీక్షించారు. డీడీయూ జీకేవై 2.0 కింద కేటాయించిన లక్ష్యాల ప్రకారం శిక్షణ, ఉద్యోగ కల్పనను సకాలంలో పూర్తి చేయడానికి సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడం కోసం చర్చించిన ఇతర అంశాల్లో కింది కార్యక్రమాలూ భాగంగా ఉన్నాయి:
ఆమోదం పొందిన ప్రాజెక్టుల వేగవంతమైన అమలును నిర్ధారించడానికి శిక్షణ బృందాలను సకాలంలో ప్రారంభించడం.
కార్యక్రమ పనితీరును ఎప్పటికప్పుడు, నిశితంగా పర్యవేక్షించడం కోసం అధునాతన డాష్‌బోర్డ్‌లు, విశ్లేషణాత్మక నివేదికలను రూపొందించడం.
గ్రామీణ యువత తమ ఆసక్తిని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి, శిక్షణ అవకాశాలను శోధించడానికి, ప్రాజెక్ట్ అమలు ఏజెన్సీల (పీఐఏల) పని తీరు రేటింగ్‌లను వీక్షించడానికి వీలు కల్పించడం... తద్వారా సమాచారంతో కూడిన ఎంపికలు, పారదర్శకతను ప్రోత్సహించే ఒక ఆన్‌లైన్ అభ్యర్థి నమోదు పోర్టల్.
ప్రాజెక్టు మదింపును వేగవంతం చేయడానికి, ఆమోదాల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అదనపు మదింపు సంస్థలను ఏర్పాటు చేసే అవకాశం.
కార్యక్రమ అమలును బలోపేతం చేయడం కోసం ఆటోమేటెడ్ పీఆర్ఎన్ జనరేషన్, ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కారం, బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికేట్ వెరిఫికేషన్, రియల్-టైమ్ అసెస్‌మెంట్ డాష్‌బోర్డులు, ప్రక్రియను సరళీకరించే ఇతర చర్యలు సహా సాంకేతికత-ఆధారిత సంస్కరణలు.
సమీకృత ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం, రియల్-టైమ్ అసెస్‌మెంట్ డాష్‌బోర్డులు, వాస్తవిక సందర్భాల్లో ముఖ ధ్రువీకరణ ఆధారిత హాజరు, అర్హులైన అభ్యర్థుల కోసం మళ్లీ నమోదు చేసుకోగల నిబంధనలు, కోర్సు వివరాలను స్వయంచాలకంగా ధ్రువీకరించడం కోసం ఎస్ఐడీహెచ్‌తో అనుసంధానం ద్వారా పౌర సేవలను బలోపేతం చేయడం.
ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా కేంద్ర సహాయమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, సుస్థిర జీవనోపాధిని వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తూ డీడీయూ-జీకేవై పురోగతిని సమీక్షించాం’’.


FWCK.jpeg)
***
(रिलीज़ आईडी: 2294629)
आगंतुक पटल : 8