వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీలు)

నాడు పోస్టు చేయడమైనది: 04 AUG 2026 6:10PM by PIB Hyderabad

రాష్ట్ర ప్రభుత్వాలుసంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలువిభాగాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రతియేటా వ్యవసాయ వ్యయాలు-ధరల కమిషన్ (సీఏసీపీసిఫార్సుల ఆధారంగాప్రభుత్వం దేశవ్యాప్తంగా 22 నిర్ధిష్ట వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పీలునిర్ణయిస్తుంది.

కనీస మద్దతు ధరలను ఉత్పత్తి వ్యయానికి కనీసం ఒకటిన్నర రెట్ల స్థాయిలో ఉంచాలనే ముందస్తు సూత్రాన్ని 2018-19 సంవత్సర కేంద్ర బడ్జెట్ ప్రకటించిందిదీనికి అనుగుణంగాప్రభుత్వం 2018-19 సంవత్సరం నుంచి అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం మార్జిన్‌తో... నిర్దేశిత ఖరీఫ్రబీఇతర వాణిజ్య పంటలన్నింటి కోసం ఎంఎస్‌పీలను పెంచింది.

మొత్తం ఉత్పత్తిలో... ఈ ఉత్పత్తుల మార్కెట్ ధర కనీస మద్దతు ధర కంటే తక్కువకు పడిపోయినప్పుడుమార్కెట్ చేయదగిన మిగులు మాత్రమే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా సేకరణకు అందుబాటులో ఉంటుందిరైతులకు ధరల మద్దతును అందించడానికి ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాఇతర నిర్దేశిత రాష్ట్ర ఏజెన్సీల ద్వారా ధాన్యాలుముతక ధాన్యాలను సేకరిస్తుందిపప్పుధాన్యాలునూనె గింజలుకొబ్బరి సేకరణ... ఈ ఉత్పత్తుల మార్కెట్ ధర ఎంఎస్‌పీ కంటే తక్కువకు పడిపోయినప్పుడుసంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకుసంబంధిత మార్గదర్శకాల ప్రకారంప్రధాన పథకమైన ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (పీఎం-ఆశాపథకం కింద అనుబంధ పథకమైన ధరల మద్దతు పథకానికి అనుగుణంగా జరుగుతుందిపీఎం-ఆశా పథకం కింద నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్)నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సీసీఎఫ్)లు సేకరణ ఏజెన్సీలుగా ఉంటాయిపత్తిజనపనారనూ ప్రభుత్వం వరుసగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐద్వారా కనీస మద్దతు ధరకు సేకరిస్తుంది.

దీనికి అదనంగా... ఉత్పత్తిమార్కెట్ చేయదగిన మిగులురైతుల సౌలభ్యంనిల్వరవాణా వంటి ఇతర సరుకు రవాణామౌలిక సదుపాయాల లభ్యతను పరిగణనలోకి తీసుకుంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా తగినన్ని సేకరణ కేంద్రాలను తెరుస్తారుఇప్పటికే ఉన్న మండీలుడిపోలుగోదాములకు అదనంగాకీలక ప్రదేశాల్లో తాత్కాలిక కొనుగోలు కేంద్రాలనూ ఏర్పాటు చేస్తారుసేకరణ ప్రక్రియ నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉందిగత కొన్ని సంవత్సరాలుగాఎంఎస్‌పీ ఆధారిత సేకరణ ప్రక్రియలు ఎంతగానో మెరుగయ్యాయిఎంఎస్‌పీని నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు చెల్లించడం... ఆధార్భూమి రికార్డులను రాష్ట్రాల సేకరణ పోర్టల్‌లతో అనుసంధానించడం ద్వారా ఎంఎస్‌పీ ఆధారిత కొనుగోలు ప్రయోజనాలను రైతులు నేరుగా పొందుతున్నారు.

పప్పుధాన్యాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించివాటిలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా ప్రభుత్వం 2030-31 వరకు 'పప్పుధాన్యాల్లో స్వయం-సమృద్ధి మిషన్'ను ప్రారంభించిందిపప్పుధాన్యాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు... పీఎం-ఆశా పథకం కింద ముందుగా నమోదు చేసుకున్న రైతుల నుంచి కందిమినుములుమసూర్ పప్పులను కేంద్ర నోడల్ ఏజెన్సీలైన నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సీసీఎఫ్ద్వారా ప్రభుత్వం సేకరిస్తోంది.

ప్రధానమంత్రి-ఆశా పథకం కింద ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకాన్నీ (ఎమ్ఐఎస్అమలు చేస్తోందిఇది త్వరగా పాడైపోయేధరల మద్దతు పథకం (పీఎస్ఎస్పరిధిలోకి రాని వ్యవసాయఉద్యానవన ఉత్పత్తుల సేకరణ కోసం ఉద్దేశించినదిపంట దిగుబడి అధికంగా ఉన్న సమయంలో ఆర్థిక స్థాయిలుఉత్పత్తి వ్యయాల కంటే ధరలు తక్కువ స్థాయికి పడిపోయినప్పుడు రైతులు వీటిని నష్టానికి అమ్ముకోకుండా రక్షించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశందీని కోసం గత సంవత్సరంతో పోలిస్తేప్రస్తుత మార్కెట్ ధరల్లో కనీసం 10 శాతం తగ్గుదల ఉండాలిఅలాంటి సందర్భంలో ఈ పథకాన్ని రాష్ట్రకేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల అభ్యర్థన మేరకు అమలు చేస్తారు.

ప్రభుత్వం 2024-25 సీజన్ నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద ధరల వ్యత్యాస చెల్లింపు (పీడీపీఅనే కొత్త విభాగాన్నీ ప్రవేశపెట్టిందిత్వరగా పాడైపోయే స్వభావం గల పంట ఉత్పత్తులను పండించిన రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరఅమ్మకపు ధర మధ్య వ్యత్యాసానికి సమాన మొత్తాన్ని నేరుగా చెల్లిస్తారురాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు పంటను స్వయంగా సేకరించడం లేదా ఎమ్ఐపీఅమ్మకపు ధర మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రైతులకు చెల్లించడం అనే రెండు ఎంపికల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

రైతుల ప్రయోజనాల దృష్ట్యా 2024-25 సీజన్ నుంచి... ప్రధాన పంటలైన టమాటాఉల్లిబంగాళాదుంపలను ఉత్పత్తి చేసే రాష్ట్రం నుంచి వినియోగించే రాష్ట్రాలకు రవాణా చేయడం కోసం అయ్యే నిల్వరవాణా ఖర్చులను కేంద్ర నోడల్ ఏజెన్సీలకురాష్ట్ర నియమిత ఏజెన్సీలకు తిరిగి చెల్లించడం కోసం ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద మరో విభాగాన్నీ చేర్చింది.

పెరిగిన కనీస మద్దతు ధర దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చిందిసేకరణరైతులకు చెల్లించిన ఎంఎస్‌పీల మొత్తం డేటా ద్వారా ఇది స్పష్టంగా తెలుస్తుంది. 2021-22 నుంచి 2025-26 (జూన్2026 వరకువరకు సేకరణరైతులకు చెల్లించిన ఎంఎస్‌పీల మొత్తం వివరాలు కింది విధంగా ఉన్నాయి:

గత ఐదేళ్లలో సేకరణరైతులకు చెల్లించిన ఎంఎస్‌పీల మొత్తం

2021-22 నుంచి 2025-26

మొత్తం సేకరణ (ఎల్ఎంటీలలో)

మొత్తం ఎంఎస్‌పీ విలువ (లక్షల కోట్లలో)

5781

14.58

 

మొత్తం 22 పంటల కనీస మద్దతు ధర ఆధారిత సేకరణ 2004-14 మధ్య 6,987 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందిఇది 2014-26 (జూన్ 2026 వరకుకాలంలో 12,819 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందిరైతులకు చెల్లించిన ఎంఎస్‌పీ మొత్తం 2004-14 మధ్య రూ. 7.41 లక్షల కోట్లుగా ఉందిఇది 2014-26 (జూన్ 2026 వరకుకాలంలో రూ. 27.80 లక్షల కోట్లకు పెరిగింది.

వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికిసాగు వ్యయాన్ని తగ్గించడానికిపంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికిలాభదాయకమైన రాబడిని అందించడానికిరైతులకు ఆదాయ మద్దతును అందించడానికి ప్రభుత్వం అనేక విధానాలుసంస్కరణలుఅభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందిఈ వివిధ పథకాలుకార్యక్రమాలు... రుణాలుబీమాఆదాయ మద్దతుమౌలిక సదుపాయాలుఉద్యానవన పంటలు సహా వివిధ పంటలువిత్తనాలుయాంత్రీకరణమార్కెటింగ్సేంద్రీయ-ప్రకృతి వ్యవసాయంరైతు సంఘాలునీటిపారుదలవిస్తరణ కార్యకలాపాలుపంటల సేకరణడిజిటల్ వ్యవసాయం మొదలైన వ్యవసాయ రంగంలోని అన్ని అంశాలనూ కవర్ చేస్తాయి.

ఈ సమాచారాన్ని వ్యవసాయరైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ ఈ రోజు లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2294535) సందర్శకుల సూచీ సంఖ్య : : 80
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी