జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాంకేతిక జౌళి రంగంలో స్టార్టప్‌లకు గ్రాంట్లు

प्रविष्टि तिथि: 04 AUG 2026 1:42PM by PIB Hyderabad

జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలో జాతీయ సాంకేతిక జౌళి మిషన్‌లో (ఎన్‌టీటీఎం) భాగంగా ఉన్న ’సాంకేతిక జౌళి రంగంలో ఆకాంక్షాత్మక ఆవిష్కర్తల కోసం పరిశోధన, పారిశ్రామికవేత్తల గ్రాంట్ (గ్రేట్)’ పథకం.. సాంకేతిక జౌళి రంగంలోని అంకుర వ్యవస్థకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. యువ ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు అంకుర సంస్థలు తమ ఆలోచనలను వాణిజ్యపరమైన సాంకేతికతలుగా, ఉత్పత్తులుగా మార్చడంలో ఈ పథకం సహాయం అందిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) ఎన్‌టీటీఎం కోసం కేటాయించిన మొత్తం బడ్జెట్ రూ. 256 కోట్లు. ఇందులో గ్రేట్ పథకం కింద అంకురాలకు ఆర్థిక సహాయం అందించే కేటాయింపులు కూడా ఉన్నాయి.

ఎన్‌టీటీఎం కింద అంకురాల ప్రతిపాదనలపై సాంకేతిక, ఆర్థిక అంశాలను పరీక్షించేందుకు, పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి ఒక ఎవల్యూయేషన్, పర్యవేక్షణ కమిటీ (ఈఎంసీ) ఏర్పాటైంది. గ్రేట్ మార్గదర్శకాల్లో నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా అంకురాల ప్రతిపాదనల ఆమోదం కోసం ఈఎంసీ తన సిఫార్సులను ఎన్‌టీటీఎం కింద ఉన్న సాధికార కార్యక్రమ కమిటీకి (ఈపీసీ) సమర్పిస్తుంది. గ్రేట్ మార్గదర్శకాలు https://nttm.texmin.gov.in/ లో అందుబాటులో ఉన్నాయి.

ఎన్‌టీటీఎం కింద అంకురాలకు అందించే గ్రాంట్లు ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్వదేశీ సాంకేతికతలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడం, విలువైన సాంకేతిక జౌళి ఉత్పత్తుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ గ్రాంట్ల ద్వారా ఊహించిన ఆర్థిక ప్రభావం, మద్దతు పొందిన అంకురాలకు, స్థిరపడిన పరిశ్రమ భాగస్వాములకూ మధ్య ఉండే బలమైన సహకారంపై ఆధారపడి ఉంటుంది. ప్రోటోటైప్ అభివృద్ధి, క్షేత్ర స్థాయి పరీక్షలు, మార్కెట్లోకి ఉత్పత్తులను విడుదల చేయడం కోసం ఆవిష్కర్తలు, పరిశ్రమ వర్గాల మధ్య బలమైన సమన్వయాన్ని పెంపొందించడం ద్వారా ఈ పథకం మార్కెట్‌కు సిద్ధంగా ఉండే వాణిజ్యీకరణను నిర్ధారిస్తుంది. ఈ చురుకైన పరిశ్రమ భాగస్వామ్యం ఈ అంకురాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లటంతో పాటు దేశంలోని మొత్తం సాంకేతిక జౌళి వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. తద్వారా విస్తృతమైన సుస్థిర పరిశ్రమ వృద్ధిని, ఉపాధి కల్పనను వేగవంతం చేస్తుందని అనుకుంటున్నారు. 

ఎన్‌టీటీఎం కింద రూ. 15.40 కోట్ల పూర్తి వ్యయంతో మొత్తం 31 అంకురాలకు ఆమోదం లభించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 13.65 కోట్లు. ఇందుకు సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి. 

ఆమోదం లభించిన అంకురాల పురోగతిని అంచనా వేయడానికి, పర్యవేక్షించడానికి ఒక సమీక్ష, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి గ్రాంటు తదుపరి విడతల విడుదలకు, ప్రాజెక్ట్‌ల ముగింపునకు ఎన్‌టీటీఎం కింద ఉన్న సాధికార కార్యక్రమ కమిటీకి సిఫార్సు చేసే అధికారం ఉంది. ఈ పథకం గురించిన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, సంభావ్య అంకుర ప్రాజెక్ట్‌లను మరింత అభివృద్ధి చేయడానికి పరిశ్రమల భాగస్వామ్యాన్ని సులభతరం చేసేందుకు దేశవ్యాప్తంగా వివిధ బహిరంగ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు, అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

వరుస సంఖ్య

అంకుర ప్రాజెక్ట్ పేరు

ఆమోదం లభించిన ప్రాజెక్టు వ్యయం

1

వేడి, చల్లదనాన్నిచ్చే అధిక పనితీరు గల వస్త్రాలు

55,00,000

2

వైద్యుల శిక్షణ కోసం వస్త్ర పదార్థాలపై ఆధారపడిన శస్త్రచికిత్స అనుకరణ నమూనాలు

50,00,000

3

పారిశ్రామిక జనపనార పుల్ట్రూషన్ కార్డ్, కాంపోజిట్ల అభివృద్ధి- వాణిజ్యీకరణ

66,16,500

4

రేపటి స్మార్ట్ వస్త్రం: శక్తి ఉత్పత్తి, సెన్సింగ్ కోసం నానోఫైబర్‌లతో కూడిన వస్త్రాలు

50,00,000

5

అధిక పనితీరు గల టైర్-యార్న్‌లు: పర్యావరణ అనుకూల ప్రక్రియ ద్వారా తయారైన పర్యావరణ అనుకూల ఉత్పత్తి

50,00,000

6

రాడోమ్ ఇంటిగ్రేటెడ్ ఐఎఫ్ఎఫ్ యాంటెన్నా

50,00,000

7

రక్షణ, ఆటోమొబైల్ అనువర్తనాల కోసం బ్రెయిడెడ్ కాంపోజిట్ల అభివృద్ధి

49,86,875

8

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో సాంకేతిక వస్త్రాల సుస్థిర ప్రాసెసింగ్

50,00,000

9

నానోమెటీరియల్ ఆధారిత స్మార్ట్ వస్త్రాల తయారీ

50,00,000

10

నోడ్ లాక్డ్ త్రిమితీయ (3డీ) పదార్థం ఆధారిత అధునాతన మిశ్రమ అభివృద్ధి

50,00,000

11

తోలు/సింథటిక్ పదార్థాలకు ప్రత్యామ్నాయంగా శైవలం ఆధారిత పూత పూసిన వస్త్రం.

56,00,000

12

యూనిక్లెన్జ్ ఉత్పత్తి, విస్తరణ - వ్యర్థరహిత, తదుపరి తరం, స్మార్ట్, స్వీయ-శుభ్రపరిచే వ్యక్తిగత రక్షణ వైద్య వస్త్రాలు

46,80,000

13

ఆసుపత్రి దుస్తుల కోసం సహజ సూక్ష్మక్రిమి నిరోధక పూత పూసిన వస్త్రాలు

49,76,000

14

బయోఇంజనీరింగ్ వస్త్రాలు, పదార్థాల తయారీ

50,00,000

15

ఆరోగ్య సంరక్షణ, శ్రేయస్సు అనువర్తనాల కోసం తెలివైన ధరించగలిగే పరికరాలను రూపొందించడానికి ఆకారాన్ని గుర్తుంచుకునే పదార్థాలతో నేసిన నూతన ఈ-వస్త్రాలు

50,00,000

16

మెరుగైన యాంత్రిక, సౌకర్యవంతమైన, ఉష్ణ గుణాలతో తీవ్రమైన చలి పరిస్థితులలో రక్షణ కోసం ప్లాస్మా సాంకేతికత ద్వారా కుంచించుకుపోని, డిటర్జెంట్ తో ఉతకగలిగే వాషబుల్, కామోఫ్లేజ్ రంగు వేసిన, ఫార్ ఇన్‌ఫ్రా-రెడ్ ఉన్ని దుస్తుల అభివృద్ధి.

50,00,000

17

నూతన మిశ్రమ పదార్థ ఆధారిత అంతరిక్షంలో మోహరించగల కమ్యూనికేషన్ యాంటీనా

56,50,000

18

వస్త్ర, పారిశ్రామిక జీరో సాలిడ్ డిశ్చార్జ్ (జేఎస్ డీ) ప్లాంట్‌లలో తుది అవశేషాల నుంచి వనరుల పునరుద్ధరణ కోసం పైలట్ స్థాయి వినూత్న జేఎస్ డీ వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి (చక్రీయత, సుస్థిరత)

47,82,250

19

స్మార్ట్ టెక్స్‌టైల్ వేరబుల్: వినూత్న ఒత్తిడి నిర్వహణ ద్వారా మానసిక శ్రేయస్సును మెరుగుపరచడం

50,00,000

20

నెలసరి పరిశుభ్రత కోసం సుస్థిర, వినూత్నమైన పరిష్కారంగా ఫ్లష్ చేయగల శానిటరీ ప్యాడ్‌లు

56,00,000

21

మెరుగైన యాంత్రిక, సౌకర్యవంతమైన లక్షణాలతో సుస్థిర, బహుళ ప్రయోజనకరమైన రక్షణ దుస్తులుగా యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఆక్సిడెంట్, యూవీ రక్షణ కలిగిన పైనాపిల్ ఫ్యాబ్రిక్‌ను అభివృద్ధి చేయడం.

50,00,000

22

స్పైడర్ సిల్క్ సాంకేతికతతో అధిక పనితీరు గల సుస్థిర ఫైబర్‌లలో విప్లవాత్మక మార్పులు

50,00,000

23

జీవపదార్థాల ఆధారంగా అధునాతన వైద్య వస్త్ర ఉత్పత్తుల అభివృద్ధి

32,50,000

24

ఎత్తైన ప్రదేశాలలో సాహస క్రీడలు, రక్షణ అనువర్తనాల కోసం అధిక పనితీరు గల క్రీడా పరికరాలు

50,00,000

25

శీతాకాలపు థర్మల్ సౌకర్యం కోసం స్మార్ట్ వస్త్రాలు

50,00,000

26

భారతీయ అసాధారణ సహజ ఫైబర్‌లు, పర్యావరణ అనుకూల ఫినిషింగ్‌లను ఉపయోగించి కాస్మెటో వస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ టెక్స్‌టైల్స్ అభివృద్ధి

50,00,000

27

అరిథ్మియా గుర్తింపు కోసం నిరంతర హృదయ స్పందన పర్యవేక్షణతో కూడిన స్మార్ట్ వెస్ట్

50,00,000

28

అంతరిక్ష అనువర్తనాల కోసం సాంకేతిక జౌళిని ఉపయోగించి తేలికైన, థర్మల్, రేడియేషన్ షీల్డింగ్ కాంపోజిట్ టైల్స్ అభివృద్ధి

23,98,000

29

భవన నిర్మాణ అనువర్తనాల కోసం వస్త్ర వ్యర్థాల మిశ్రమ ప్యానెల్లు

50,00,000

30

సహజంగా సూక్ష్మక్రిమి నిరోధక గుణాలు గల గాయాలకు కట్టు కట్టే పదార్థం, కవర్‌ఆల్స్ అభివృద్ధి కోసం సన్నని జనపనార దారం, దాని మిశ్రమాలను దేశీయంగా ఉత్పత్తి చేయడం.

50,00,000

31

నియోసెన్స్: కంఫీహగ్ వైటల్ మానిటరింగ్

50,00,000

ఈ సమాచారాన్ని జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ పబిత్రా మార్గెరిటా ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2294326) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil