సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా పీఎం-అజయ్ ఆదర్శ గ్రామ విభాగం కింద 47,328 గ్రామాల ఎంపిక

తెలంగాణ నుంచి 435 గ్రామాలు

ఈ పథకం కింద 3.28 లక్షలకు పైగా అభివృద్ధి పనులు, 47.59 లక్షలకు పైగా లబ్ధిదారుల గుర్తింపు

प्रविष्टि तिथि: 02 AUG 2026 4:35PM by PIB Hyderabad

'ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన' (పీఎం-అజయ్) ఆదర్శ గ్రామ విభాగం కింద ఆయా గ్రామాల సమగ్ర అభివృద్ధి ద్వారా షెడ్యూల్డ్ కులాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందికేంద్రరాష్ట్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానించికీలకమైన అభివృద్ధి అంతరాలను పరిష్కరించడం ద్వారా ముఖ్య సామాజిక-ఆర్థిక సూచికల్లో సంతృప్త స్థాయిని నిర్ధారించడం ఈ పథకం లక్ష్యం.

సామాజిక న్యాయంసాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌దాస్ అథవాలే రాజ్యసభలో శ్రీ అనిల్ కుమార్ యాదవ్ మందాడికి లిఖితపూర్వకంగా ఈ వివరాలను తెలిపారుపీఎం-అజయ్ పథకంలోని ఆదర్శ గ్రామ విభాగం కింద దేశవ్యాప్తంగా 47,328 గ్రామాలను ఎంపిక చేయగాఇందులో తెలంగాణలోని 435 గ్రామాలూ ఉన్నాయని కేంద్ర మంత్రి సభకు తెలియజేశారురాష్ట్రాల వారీగా ఎంపికైన గ్రామాల వివరాలను సభ ముందు ఉంచారు.

లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి ఈ సమాచారాన్ని పేర్కొన్నారుఆదర్శ గ్రామ విభాగం... విద్య సహా 10 రంగాల్లో పర్యవేక్షించదగిన 50 సామాజిక-ఆర్థిక సూచికలను సమగ్రపరచడం ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో సమీకృత అభివృద్ధిపై దృష్టి సారిస్తుందిఈ సూచికల ప్రాథమిక స్థితిని నిర్ధారించడానికి అవసరాల అంచనా కోసం సర్వే నిర్వహిస్తారుగుర్తించిన సమస్యలను కేంద్రరాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం ద్వారా లేదా పీఎం-అజయ్ కింద మద్దతునిచ్చే చర్యల ద్వారా పరిష్కరిస్తారురాష్ట్రాలు సాధించిన పురోగతిని పీఎంఏజీవై పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారు.

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 3,28,131 అభివృద్ధి పనులను1,10,51,213 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు సభకు తెలియజేశారువీటిలో 46,642 అభివృద్ధి పనులు పూర్తి కాగాఇప్పటివరకు 47,59,399 మంది లబ్ధిదారులు లబ్ధి పొందారు.

తెలంగాణకు సంబంధించివిద్యా రంగం కింద 3,529 మంది లబ్ధిదారులను గుర్తించగావారిలో 472 మంది లబ్ధిదారులు ఇప్పటికే ఈ పథకం కింద లబ్ధి పొందారని లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

థర్డ్-పార్టీ ఆడిట్‌కు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూపీఎం-అజయ్ ఆదర్శ గ్రామ విభాగం కింద ఆదర్శ గ్రామ స్వీయ-ప్రకటనను ధ్రువీకరించాలని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి సభకు తెలియజేశారు.

 

***


(रिलीज़ आईडी: 2293535) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी