రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణ అకౌంట్ల కంట్రోలర్ జనరల్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన శ్రీమతి అల్కా నాంగియా అరోరా

प्रविष्टि तिथि: 01 AUG 2026 2:59PM by PIB Hyderabad

రక్షణ అకౌంట్ల కంట్రోలర్ జనరల్‌ (సీజీడీఏ)గా శ్రీమతి అల్కా నాంగియా అరోరా ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. శ్రీమతి అల్కా నాంగియా అరోరా ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (ఐడీఏఎస్)కు చెందిన 1991 బ్యాచ్‌ ఆఫీసరు.
డెహ్రాడూన్ ‌లోని గఢ్‌వాల్ విశ్వవిద్యాలయంతో పాటు ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థిని అయిన శ్రీమతి అరోరా.. కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులను నిర్వహించారు. ఆ పదవులలో.. వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన వ్యవసాయ పరిశోధన, విద్య విభాగం (డీఏఆర్ఈ)లో అదనపు కార్యదర్శి, ఆర్థిక సలహాదారు; సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శి; సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టరు; జౌళి మంత్రిత్వశాఖలో హస్తకళల అడిషనల్ డెవలప్‌మెంట్ కమిషనరు వంటివి ఉన్నాయి. రక్షణ రంగ ఆర్థిక నిర్వహణ, ప్రజా సేవ రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న శ్రీమతి అల్కా నాంగియా అరోరా .. హస్తకళల ప్రోత్సాహం, వ్యవసాయ పరిశోధన, కొనుగోలు విధానం, పబ్లిక్ ఫైనాన్స్‌లతో ముడిపడిన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. ఐఐఎమ్ బెంగళూరు, ఐఎస్‌బీ మొహాలీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలలో ఉన్నత స్థాయి శిక్షణనూ పూర్తి చేశారు.      
శ్రీమతి అల్కా నాంగియా తన కెరియర్‌ను రక్షణ శాఖలో ప్రారంభించి, కోల్‌కతాలోని డమ్ డమ్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహించారు. తరువాత డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ (డీఏడీ)లో కీలక పదవీబాధ్యతలను నిర్వహించారు. మూడు సాయుధ దళాలతోనూ కలిసి, విస్తృత అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. ముంబయిలోని నావల్ డాక్‌యార్డులో అడ్మిరల్ సూపరింటెండెంట్ (ఏఎస్‌డీ)కు ఆర్థిక సలహాదారు (ఎఫ్ఏ), కోల్‌కతాలో సైన్య ఈస్ట్రన్ కమాండ్‌తో పటు ఏరియా అకౌంట్స్ ఆఫీస్ అధిపతికి ఎఫ్ఏ, వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ (డబ్ల్యూఏసీ), ఆర్మీ హాస్పిటల్ రిసర్చ్, రెఫరల్ (ఏహెచ్‌ఆర్ఆర్)కు ఏకీకృత ఆర్థిక సలహాదారు (ఐఎఫ్ఏ), వైమానిక దళ ప్రధానకేంద్రానికి ప్రిన్సిపల్ ఐఎఫ్ఏగా బాధ్యతలు నిర్వహించారు. రక్షణ ఖాతాల కంట్రోలర్ జనరల్‌ (సీజీడీఏ) ప్రధానకేంద్రంలో అదనపు సీజీడీఏ, స్పెషల్ సీజీడీఏగా కూడా శ్రీమతి అరోరా సేవలను అందించారు. ఈ క్రమంలో.. ఆడిట్, ఐటీ, సిస్టమ్స్, ఏకీకృత ఆర్థిక సలహాదారు (ఐఎఫ్ఏ), శిక్షణలకు సంబంధించిన విధానాల అమలులో శ్రీమతి అరోరా ముఖ్య పాత్రను పోషించారు.

 

***


(रिलीज़ आईडी: 2293117) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी