ఆయుష్
azadi ka amrit mahotsav

ఆయుష్ బీమా నెట్‌వర్కులు

प्रविष्टि तिथि: 31 JUL 2026 3:35PM by PIB Hyderabad

భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికరణ సంస్థ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఇండియా .. ఐఆర్‌డీఏఐ) 2024 మే 29న జారీ చేసిన మాస్టర్ సర్కులర్‌లో పేర్కొన్న ప్రకారం.. బీమా సంస్థలు ఆయుష్ సహా అన్ని చికిత్స పద్ధతులనూ లెక్క లోకి తీసుకుంటూ పాలసీదారులకు బహుళ ఐచ్ఛికాలను అందించే పథకాలను, యాడ్- ఆన్‌లను, రైడర్‌లను అందుబాటులో ఉంచాలి. దీనికి తోడు, బీమాసంస్థలు.. బోర్డు ఆమోదం తెలిపిన పూచీ విధానాన్ని అనుసరించాలి. దీని వల్ల ఇతర చికిత్స పద్ధతులతో సమాన ప్రాతిపదిక ఆయుష్ చికిత్సలకు కూడా లభిస్తుంది. ఇది వర్తించదగిన నియంత్రణ స్వరూపానికి అనుగుణంగా కూడా ఉండాలి. దీంతో పాలసీదారులకు తమకు నచ్చిన చికిత్సను ఎంపిక చేసుకొనే ఐచ్ఛికం అందుబాటులో ఉంటుంది.
ఆయుష్ నిర్దిష్ట చికిత్సల కవరేజీ, రీయింబర్స్‌మెంటులు సంబంధిత ఆరోగ్య బీమా పాలసీల షరతులు, నిబంధనలతో పాటు, వర్తించే నియంత్రణపూర్వక ఫ్రేంవర్కుకు లోబడి ఉంటాయి.
దీనికి అదనంగా, 2026లో ఆయుష్ చికిత్సలకు సంబంధించిన బీమా రక్షణకు ప్రామాణిక రేట్లను ఆయుష్ మంత్రిత్వశాఖ సవరించింది. దీనిలో ఆయుష్ చికిత్సలకు బీమా రక్షణలో ప్రమాణీకరణను, పారదర్శకత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రమాణీకరించిన చికిత్స ప్యాకేజీలు, అదనపు ప్రక్రియలు, సంబంధిత కార్యకలాపాల మార్గదర్శకాలను కూడా పొందుపరిచారు.
దేశవ్యాప్తంగా ఆయుష్ చికిత్సలకు విస్తృత బీమా రక్షణ లభించేలా ప్రోత్సహించడానికి మంత్రిత్వశాఖ సాధారణ బీమా సంస్థలు, ఆయుష్ ఆసక్తిదారులను దృష్టిలో పెట్టుకొని అయిదు జాగరూకత కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఆయుష్ సంస్థలను భారతీయ బీమా సమాచార మండలి (ఐఐబీఐ)కి చెందిన రిజిస్ట్రీ ఆఫ్ హాస్పిటల్స్ ఇన్ నెట్‌వర్క్ ఆఫ్ ఇన్సూరెన్స్ (ఆర్ఓహెచ్ఐఎన్ఐ)లో నమోదు, బీమా సంస్థలతో చేతులు కలపడం (ఎంప్యానల్‌మెంటు), డిజిటల్ డాక్యుమెంటేషనును పూర్తి చేయడం, క్లెయిమును ప్రాసెస్ చేసే ప్రక్రియలలో మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమాలను జాంనగర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచింగ్, రిసర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటీఆర్ఏ), న్యూఢిల్లీ లోని అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ), బెంగళూరు లోని జాతీయ యునానీ చికిత్స సంస్థ (ఎన్ఐయూఎమ్), చెన్నై లోని జాతీయ సిద్ధ సంస్థ (ఎన్ఐఎస్)తో పాటు కోల్‌కతాలోని జాతీయ హోమియోపతి సంస్థ (ఎన్ఐహెచ్)లలో నిర్వహించారు.
దీనికి తోడు, 2026 ఆయుష్ చింతన శిబిరం ప్రారంభ కార్యక్రమాన్ని 2026 ఏప్రిల్ 16న న్యూఢిల్లీలో నిర్వహించిన సందర్భంగా ఒక అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎమ్ఓయూ) కుదుర్చుకున్నారు. ఈ ఎంఓయూపై ఆయుష్ శాఖ ఆధ్వర్యంలోని అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ), జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (జీఐసీ) సంతకాలు చేశాయి. బీమా సంస్థల పాలసీదారులు మరింత సులభంగా ఆయుష్ చికిత్సలను అందుకోవడానికి ఏర్పాట్లు చేయడమే ఈ ఎమ్ఓయూ ఉద్దేశం. దీనికోసం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఆయుష్ ఆస్పత్రుల్లో జీఐసీతో కలిసి ఉమ్మడి ఎంప్యానల్‌మెంటుకు మార్గం సుగమం అవుతుంది. ఫలితంగా ఆరోగ్య బీమాలో భాగంగా ఆయుష్ ఆరోగ్యసంరక్షణ సేవలు అందుబాటులోకి రావడమే కాకుండా సౌలభ్యం కూడా విస్తృతం అవుతుంది.  
దీనికి అదనంగా, మంత్రిత్వశాఖ న్యూఢిల్లీ లోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో ఆయుష్ ఆరోగ్య బీమా కోసం ఒక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ (పీఎమ్‌యూ)ను ఏర్పాటు చేసింది. పీఎమ్‌యూ ఉద్దేశాల్లో.. జీఐసీ ద్వారా బీమా సంస్థలతో ఆయుష్ ఆస్పత్రుల ప్యానల్లో చేరే ప్రక్రియకు మార్గాన్ని సుగమం చేయడం, ప్యానల్లో చేరే ప్రక్రియను పూర్తి చేసేందుకు సాంకేతిక, పరిపాలన పరమైన సహాయాన్ని అందించడం, బీమా సంస్థలు, ఆరోగ్యసంరక్షణ సేవలను అందించే సంస్థలతో సమన్వయాన్ని ఏర్పరుచుకోవడం, ఫిర్యాదుల పరిష్కారంలో సహాయం చేయడం, ఆయుష్ ఆరోగ్య బీమా కార్యక్రమాల అమలులో తోడ్పాటును అందించడం, ఆసక్తిదారుల మధ్య సమన్వయాన్ని నెలకొల్పడం, ఆయుష్ ఆరోగ్య బీమాను జనబాహుళ్యంలోకి విస్తృతంగా ప్రచారం చేయడం భాగంగా ఉన్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ ఈ రోజు లోక్‌సభలో ఒక రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.

 

***


(रिलीज़ आईडी: 2292652) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी