గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహిళల నేతృత్వంలోని సంస్థలను ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా బలోపేతం చేయటానికి ఎంఓఆర్‌డీ, పీసీఐ ఇండియా మధ్య ఆర్థికేతర అవగాహనా ఒప్పందం

प्रविष्टि तिथि: 29 JUL 2026 6:16PM by PIB Hyderabad

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌డీ), దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎంద్వారా మహిళా నేతృత్వంలోని సంస్థలను (డబ్ల్యూఎల్ఈలుముఖ్యంగా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీఆధ్వర్యంలోని సంస్థలను ప్రభుత్వ కొనుగోళ్లుమార్కెట్ అనుసంధానంతో కూడిన సంస్థాగత అభివృద్ధి ద్వారా బలోపేతం చేయటానికి ప్రాజెక్ట్ కన్సర్న్ ఇంటర్నేషనల్ (పీసీఐఇండియాతో నేడు ఆర్థికేతర అవగాహన ఒప్పందం (ఎంఓయూకుదుర్చుకుంది.

గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కన్సల్ అధ్యక్షతన ఈ అవగాహన ఒప్పందం జరిగిందిగ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (గ్రామీణ జీవనోపాధులుశ్రీ స్వాతి శర్మపీసీఐ ఇండియా సీఈఓజాతీయ సంచాలకుడు శ్రీ ఇంద్రజిత్ చౌధురి ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

బిల్‌మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బీఎంజీఎఫ్మద్దతుతో "మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వ కొనుగోళ్ల విధాన వినియోగంద్వారా 2022లో ప్రారంభించిన సహకారాన్ని ఈ అవగాహన ఒప్పందం లాంఛనప్రాయం చేస్తుందిమహిళా నేతృత్వంలోనిఎస్‌హెచ్‌జీ సంస్థలకు సంస్థాగత సంసిద్ధతసామర్థ్య పెంపుమార్కెట్ వసతులను కల్పించటం ద్వారా ప్రభుత్వసంస్థాగత కొనుగోళ్లలో భాగస్వామ్యాన్ని మెరుగుపరచాలని ఈ ఒప్పందం ఉద్దేశం.

2026-2029 కాలానికి సంబంధించిన మూడేళ్ల ఎంఓయూకు ఆర్థికేతర స్వభావం ఉందిఇరువర్గాల మధ్య ఎలాంటి నిధుల బదిలీ లేదా ఆర్థిక బాధ్యత ఉండదుఈ ఒప్పందం ద్వారా చేపట్టే కార్యకలాపాల కోసం ప్రతి వర్గం ఖర్చులను స్వయంగా భరిస్తాయి.

డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం ద్వారా నేషనల్ రిసోర్స్ సెల్ (ఎన్ఆర్సీ), ప్రభుత్వ కొనుగోళ్లువ్యాపార నమూనా మద్దతు విభాగం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఈ భాగస్వామ్యంలో కీలక అంశందీనికి పీసీఐ ఇండియా సాంకేతిక మద్దతు అందిస్తుందిఈ విభాగం.. ఎస్‌ఆర్‌ఎల్‌ఎమ్‌ల్లో కొనుగోలు అనుసంధాన వాణిజ్య వ్యవస్థలను బలోపేతం చేయటానికి వ్యూహాత్మకకార్యాచరణ మద్దతును అందిస్తుంది.

ఈ భాగస్వామ్యం ద్వారా సంస్థాగత ఇంక్యుబేషన్ ఫ్రేమ్‌వర్కులుఎస్‌ఓపీలుఆపరేషనల్ టూల్‌కిట్లుప్రామాణిక సామర్థ్య పెంపు మాడ్యూళ్ల అభివృద్ధికి మద్దతు లభిస్తుందిప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జెమ్ఆన్‌బోర్డింగ్టెండర్లలో పాల్గొవటంనాణ్యతా ప్రమాణాలుడాక్యుమెంటేషన్కొనుగోళ్ల సమ్మతిపై ఎస్‌ఆర్‌ఎల్‌ఎమ్‌ బృందాలకుఎస్‌హెచ్‌జీ సంస్థలకు శిక్షణచేదోడువాదోడుగా నిలవటం వంటి వాటిని ఇది సులభతరం చేస్తుందిపునరుత్పాదక ఇంధన ఏకీకరణస్థిరమైన ఉత్పత్తి పద్ధతులుసంబంధిత ప్రభుత్వ సంస్థలతో అనుసంధానం ద్వారా స్థిరమైన సంస్థాగత మోడళ్లను ఈ సహకారం మరింత అన్వేషించిప్రోత్సహిస్తుంది.

2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇతర రాష్ట్రాలతో విస్తృతమైన భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తూనే.. మొదటగా అస్సాంబీహార్జార్ఖండ్కర్ణాటకమహారాష్ట్రరాజస్థాన్ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యేక సాంకేతిక సహాయం అందించాలని ప్రతిపాదించారుజాతీయ సాంకేతిక అభ్యాస సెషన్లుఅంతర్-రాష్ట్రాల మధ్య జ్ఞానాన్ని పంచుకోవటంఎంటర్‌ప్రైజ్ అవకాశాల మ్యాపింగ్కొనుగోలు-అనుసంధాన వ్యాపార నమూనాల అభివృద్ధిని కూడా చేపడతాయి.

ఎస్‌హెచ్‌జీ వ్యాపారాలకు ప్రభుత్వ కొనుగోలు మార్కెట్లలో ప్రవేశం కల్పించేందుకు స్థిరమైనవిస్తృతమైన వ్యాపారాల నిర్వహణకుమహిళల ఆర్థిక సాధికారతను ముందుకు తీసుకెళ్లేందుకు సాంకేతిక మద్దతును అందించటంలో ఈ ఎంఓయూ కీలక ముందడుగా నిలుస్తుందిఈ భాగస్వామ్యం డీఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం లక్ష్యాలకు.. స్థిరమైనవ్యాపార ఆధారితమార్కెట్-అనుసంధాన జీవనోపాధుల ద్వారా కోట్ల మంది లఖ్‌పతి దీదీలను సృష్టించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఉంది.

గ్రామీణ మహిళలకు సమ్మిళితస్థిరమైనమార్కెట్-ఆధారిత జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించటం ద్వారా వికసిత్ భారత్-2047, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలుభారతదేశ నెట్ జీరో ఆశయాల వంటి విస్తృత జాతీయ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ సహకారం తోడ్పడుతుంది.

 

***


(रिलीज़ आईडी: 2291512) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी