రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

‘మచిలీపట్నం’ యుద్ధనౌక జల ప్రవేశం


ఎంఏహెచ్ఈ-శ్రేణి జలాంతర్గామి నిరోధక యుద్ధనౌకల్లో ఇది ఏడోది

प्रविष्टि तिथि: 29 JUL 2026 5:56PM by PIB Hyderabad

భారత నౌకాదళం కోసం కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఎనిమిది జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌకల్లో ఏడోదైన మచిలీపట్నం (బీవై 529) యుద్ధ నౌక ఈ రోజు జల ప్రవేశం చేసింది. సైనిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్, శ్రీమతి గూల్రుఖ్ ఆనంద్‌లు ఈ నౌకను ప్రారంభించి, జల ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి భారత నావికాదళం, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లకు చెందిన ఉన్నతాధికారులు, ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో గల చరిత్రాత్మక ఓడరేవు పట్టణమైన మచిలీపట్నం పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ పట్టణం గొప్ప సముద్ర వారసత్వానికి, భారత తూర్పు తీరప్రాంతంలో వర్ధిల్లుతున్న వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది. మచిలీపట్నం చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ నౌక మచిలీపట్నం స్ఫూర్తిని, వారసత్వాన్ని సగర్వంగా ప్రతిబింబిస్తూ... దేశ నౌకా వాణిజ్య ప్రయోజనాలను పరిరక్షించడం పట్ల భారత నౌకాదళ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.

ఈ నౌక నీటి అడుగున నిఘా, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం (ఏఎస్‌డబ్ల్యూ), అల్ప తీవ్రత గల నౌకా వాణిజ్య కార్యకలాపాలు (ఎల్ఐఎమ్‌వో) సహా మైన్ వార్‌ఫేర్ సామర్థ్యంతో సన్నద్ధమైంది. ఈ నౌక తీరప్రాంత రక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు, నౌకా వాణిజ్య రంగం పట్ల అవగాహననూ మెరుగుపరుస్తుంది.

మచిలీపట్నం నౌక ప్రారంభం... ఏఎస్‌డబ్ల్యూ ఎస్‌డబ్ల్యూసీ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడంలో మరో కీలక మైలురాయిని సూచిస్తుంది. రక్షణ రంగ తయారీలో స్వయం-సమృద్ధ భారత్ సాధన పట్ల భారత నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది. 80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ ప్రాజెక్టు మెరుగవుతున్న భారత నౌకా నిర్మాణ పరిశ్రమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశ నౌకా వాణిజ్య ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత నౌకాదళ కార్యాచరణ సంసిద్ధతనూ గణనీయంగా మెరుగుపరుస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2291503) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Malayalam