బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు మార్పిడి కేంద్రం నిర్వహణ, క్రమబద్ధమైన ధరల ఆవిష్కరణ

నాడు పోస్టు చేయడమైనది: 27 JUL 2026 5:10PM by PIB Hyderabad

‘బొగ్గు మార్పిడి నియమాలు-2026’ను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  గనులుఖనిజాల (అభివృద్ధినియంత్రణసవరణ చట్టం- 2025 ద్వారా గనులుఖనిజాల (అభివృద్ధినియంత్రణచట్టం-1957 [ఎంఎండీఆర్ చట్టం-1957]లో చేర్చిన సెక్షన్ 18(బి)(3)కు అనుగుణంగా వీటిని జూన్ 4, 2026 నాటి నోటిఫికేషన్ నంబర్ జీ.ఎస్.ఆర్ 442 (ద్వారా భారత గెజిట్‌లో ప్రకటించారు.

ఎంఎండీఆర్ చట్టం-1957లోని సెక్షన్ 18బి లోని అధికారాలను ఉపయోగించి.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖడిసెంబరు 10, 2025 నాటి ఎస్.. 5730 (నోటిఫికేషన్ ద్వారా భారతదేశంలో ఏర్పాటు చేయబోయే బొగ్గు మార్పిడి కేంద్రాలను నమోదు చేసేందుకునియంత్రించేందుకు బొగ్గు నియంత్రణ సంస్థను అధికార సంస్థగా నియమిస్తూ భారత గెజిట్‌ను ప్రచురించింది.

సొంత అవసరాలు, వాణిజ్య పరంగా బొగ్గు తవ్వకాలు జరిపే మైనింగ్ సంస్థలతో సహా ఏ సంస్థ అయినా బొగ్గు మార్పిడికి లావాదేవీలు జరపవచ్చువ్యాపారం చేయవచ్చుడెలివరీ ఆధారిత ఒప్పందాల్లో ప్రవేశించవచ్చుబొగ్గు మార్కెట్ వేదికల్లో వ్యాపారం చేసినలావాదేవీలు జరిపిన బొగ్గు ధరల నిర్ణయ ప్రక్రియను బొగ్గు మార్పిడి కేంద్రం చేపడుతుందిన్యాయమైనస్థిరమైనపోటీతత్వంతో కూడినసమర్థవంతమైన ధరలను నిర్ధారించే విధానం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందిబిడ్డింగ్ధరల నిర్ణయ విధానాలు సీసీఓ ఆమోదించిన ప్రక్రియకు అనుగుణంగానే నిర్వహిస్తారు.

కొనుగోలు చేసిన బొగ్గు నాణ్యత ఆధారంగా ఒప్పందంలో ఉన్న ధరల సవరణ పద్ధతి, బొగ్గు నమూనా పరీక్ష సంస్థ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ప్రకారం తుది ధరను సర్దుబాటు చేస్తారుబొగ్గు మార్పిడి నియమాలు-2026 ప్రకారం ఏర్పాటు చేసిన మార్కెట్ పర్యవేక్షణ విధానం.. బొగ్గు మార్పిడి వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించిమార్కెట్ దుర్వినియోగాన్ని అడ్డుకుంటుందిప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలు కూడా మార్కెట్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవటానికి ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.

ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీశ్‌ చంద్ర దూబే ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2290195) సందర్శకుల సూచీ సంఖ్య : : 43
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी