చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం చేయూత కొనసాగింపు

प्रविष्टि तिथि: 25 JUL 2026 9:01PM by PIB Hyderabad

  జిల్లా స్థాయి సహా దిగువ స్థాయి న్యాయస్థానాలకు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తోందిఈ బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంతాలదే అయినావాటి వనరుల బలోపేతం దిశగా కేంద్ర ప్రభుత్వం ద్వారా 1993-94 నుంచి జిల్లా స్థాయి సహా  దిగువ స్థాయి న్యాయస్థానాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ‘కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్‌ఎస్‌అమలవుతోందిదీనికింద కోర్టు హాళ్లున్యాయాధికారుల నివాసాలున్యాయవాదుల హాళ్లుమరుగుదొడ్ల సముదాయాలుడిజిటల్ కంప్యూటర్ గదుల నిర్మాణానికి నిధులు లభిస్తాయిఈ పథకం పనితీరును దేశవ్యాప్తంగా ఒక స్వతంత్ర సంస్థ పర్యవేక్షిస్తూంటుందిఅంతేకాకుండా సంబంధిత పార్లమెంటరీ స్థాయీ సంఘం (డీఆర్‌పీఎస్‌సీఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.

ఈ నేపథ్యంలో ‘సీఎస్‌ఎస్‌’ కింద సంబంధిత రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలుహైకోర్టుల ద్వారా ప్రాజెక్టులను ఎంపిక చేస్తారుతదనుగుణంగా సమగ్ర ప్రతిపాదనలు అందిన తర్వాత నిధుల తాత్కాలిక కేటాయింపుఅటుపైన ప్రధాన మంజూరు ఉత్తర్వు (మదర్ శాంక్షన్జారీ అవుతాయిఅనంతరం ‘సీఎస్‌ఎస్‌’ మార్గదర్శకాల మేరకుప్రధాన ఉత్తర్వు మంజూరుకు లోబడి గుర్తించిన ప్రాజెక్టులపై ఆయా రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో పనుల కోసం నిధులును వినియోగించుకోవచ్చుఈ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 2026-27కుగానురూ.8.79 కోట్ల మదర్ శాంక్షన్ జారీచేసిన నేపథ్యంలో పథకం గడువు (సన్‌సెట్‌ డేట్‌) 31.03.2026తో ముగియగా, 30.09.2026 వరకు తాత్కాలిక పొడిగింపునిచ్చింది.

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారంనెల్లూరు జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత అందుబాటులో గలనిర్మాణంలో ఉన్న కోర్టు మౌలిక సదుపాయాల వివరాలు (జిల్లాల వారీగాఅనుబంధం-1లో ఉన్నాయి.

(సి): గడచిన ఐదేళ్లలో సీఎస్‌ఎస్‌ కింద నెల్లూరు జిల్లా సహా రాష్ట్రంలోని జిల్లా కోర్టు మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం విడుదల చేసిన-వినియోగించిన నిధుల వివరాలు కిందివిధంగా ఉన్నాయి:

.సం.

ఆర్థిక సంవత్సరం

నిధుల విడుదల రూ.కోట్లలో)

1

2021-22

0.00 

2

2022-23

22.50

3

2023-24

49.82

4

2024-25

0.99

5

2025-26

30.98

 

మొత్తం

104.29

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అందిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా (31.05.2026 నాటికిన్యాయస్థానాల్లో ఖాళీల సంబంధిత న్యాయపరమైన జిల్లాలవారీ వివరాలివే:

.సం.

న్యాయపరమైన జిల్లా

వాస్తవ సంఖ్య

ఖాళీలు

1

అనంతపురం

63 

15

2

చిత్తూరు

80

24

3

తూర్పు గోదావరి

80

12

4

గుంటూరు

79

4

5

కడప

49

5

6

కృష్ణా

107

13

7

కర్నూలు

76

19

8

నెల్లూరు

49

6

9

ప్రకాశం

50

7

10

శ్రీకాకుళం

41

8

11

విశాఖపట్నం

102

10

12

విజయనగరం

32

5

13

పశ్చిమ గోదావరి

67

9

 

మొత్తం

875

137

*జిల్లా కోర్టుల ప్రాదేశిక అధికార పరిధి పరిపాలన/రెవెన్యూ ప్రాదేశిక అధికార పరిధికి భిన్నం

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం- 2021కి ముందు ప్రారంభమైన రెండు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా కొనసాగుతోందివీటిలో (i) కోనసీమ జిల్లారామచంద్రపురంలో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్నివాస భవనం, (ii) కర్నూలు జిల్లాఆదోనిలో కోర్టుల భవన సముదాయం నిర్మాణంలో ఉన్నాయిఈ పథకం కింద ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించిపర్యవేక్షించడం కోసం ‘న్యాయ వికాస్ పోర్టల్’ రూపేణా ఒక ఆన్‌లైన్ పర్యవేక్షణ యంత్రాంగం పనిచేస్తోంది.

అనుబంధం-I

జిల్లా

మొత్తం ప్రాజెక్టుల సంఖ్య

పూర్తయినవి/పనిచేస్తున్నవి

నిర్మాణంలో ఉన్నవి

అన్నమయ్య

1

1

అనకాపల్లి

0

2

తూర్పు గోదావరి

1

1

ఏలూరు

0

2

వైఎస్ఆర్ కడప

0

4

తిరుపతి

0

1

విజయనగరం

0

1

పార్వతీపురం

0

2

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ

1

1

కృష్ణా

1

0

కర్నూలు

0

1

నంద్యాల

0

1

పశ్చిమ గోదావరి

0

1

చిత్తూరు

0

1

కాకినాడ

2

2

ఎన్.టి.ఆర్

1

1

విశాఖపట్నం

1

1

ప్రకాశం

1

1

శ్రీకాకుళం

1

0

ఒంగోలు

0

0

నెల్లూరు

0

0

అనంతపురం

0

0

విజయనగరం

0

0

గుంటూరు

0

0

మొత్తం

10

24

కేంద్ర శాసన-న్యాయ శాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.

 

****


(रिलीज़ आईडी: 2289622) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी