ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆదర్శప్రాయ, శ్రేష్ఠమైన వ్యక్తి గుణాలను చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 22 JUL 2026 7:42AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు.  ఈ సుభాషితం వ్యక్తిగత, సామాజిక, జాతీయ కర్తవ్యాలను నెరవేర్చడంలో ఆదర్శప్రాయ, శ్రేష్ఠమైన వ్యక్తి గుణాలను మనకు తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘పరకార్యేషు యుక్తాత్మా స్వకార్యే క్షిప్రసాధనమ్
సుహృత్కార్యేషు నివృత్తీ రాజకార్యేషు విక్రమః’’ అని పేర్కొన్నారు. 

ఇతరుల పనులను పూర్తి చేయడంలో అత్యంత నిష్ఠతో నిమగ్నమయ్యే వ్యక్తి, తన వ్యక్తిగత పనులను త్వరగా, సమర్థంగా నెరవేర్చే వ్యక్తి, మిత్రుల పనులను స్వార్థరహితంగా ముగించే వ్యక్తి, దేశం పట్ల కర్తవ్యాలను నిర్వహించడంలో తన పూర్తి పరాక్రమాన్ని, సాహసాన్ని కనబరిచే వ్యక్తి మాత్రమే శ్రేష్ఠమైన వ్యక్తి అని  ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2287560) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam