మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ మైనారిటీల కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ హర్జిత్ సింగ్ గ్రేవాల్


జాతీయ మైనారిటీల కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా శ్రీమతి ఎస్‌ మునవరి బేగం బాధ్యతల స్వీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 21 JUL 2026 6:37PM by PIB Hyderabad

జాతీయ మైనారిటీల కమిషన్ (ఎన్‌సీఎంచైర్మన్‌గా శ్రీ హర్జీత్ సింగ్ గ్రేవాల్ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారుఈ నియామకంతో మైనారిటీ వర్గాల సంక్షేమంసమ్మిళితత్వంసాధికారతసామాజికఆర్థిక అభివృద్ధిభాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా నూతన అధ్యాయం ప్రారంభమైందిప్రజా జీవితంసంస్థాగత నాయకత్వంలో విస్తృత అనుభవం కలిగిన ఆయన సామాజిక సామరస్యంప్రజా సంక్షేమంసమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

 


జాతీయ మైనారిటీల కమిషన్ సభ్యురాలైన శ్రీమతి ఎస్ మునవరి బేగం జూలై 20, 2026న కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారుప్రజాసేవలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆమె.. మైనారిటీల హక్కుల పరిరక్షణసమాన అవకాశాల కల్పనసమగ్ర పాలనను బలోపేతం చేయడం వంటి కమిషన్‌ లక్ష్యాలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు.

 

కమిషన్ కార్యాలయానికి చేరుకున్న నూతన చైర్మన్ శ్రీ హర్జీత్ సింగ్ గ్రేవాల్‌కు జాతీయ మైనారిటీల కమిషన్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఆత్య నంద్ఇతర సీనియర్ అధికారులు ఘన స్వాగతం పలికారుక్రైస్తవ వర్గానికి  ప్రాతినిధ్యం వహిస్తూ నూతన సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ గ్లెన్ సౌజా టిక్లోకి కమిషన్ స్వాగతం పలికిందిప్రముఖ ప్రజా ప్రతినిధి శ్రీ టిక్లో 2012 నుంచి 2022 వరకు గోవా శాసనసభలో ఆల్డోనా నియోజకవర్గం ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు సేవలు అందించారు.

 

పార్సీ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ శ్రీ బెర్జిస్ దేశాయ్ మార్చి 10, 2026న జాతీయ మైనారిటీల కమిషన్ సభ్యుడిగా చేరారుప్రజా ప్రతినిధిప్రసిద్ధ రచయిత శ్రీ దేశాయ్ హైకోర్టు న్యాయవాదిగానూ ఎంతో గుర్తింపు పొందారు.

వివిధ మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్వైస్ చైర్‌పర్సన్సభ్యుల నియామకంతో జాతీయ మైనారిటీల కమిషన్.. న్యాయంసమానత్వంసాధికారతసమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కమిషన్ తన కృషిని మరింత బలోపేతం చేయడానికి జాతీయ మైనారిటీల కమిషన్ సిద్ధంగా ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2287519) సందర్శకుల సూచీ సంఖ్య : : 66
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी