ప్రధాన మంత్రి కార్యాలయం
మహాప్రభు జగన్నాథుని ఆశీర్వాదాలు కోరుకుంటూ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
16 JUL 2026 10:45AM by PIB Hyderabad
రథయాత్ర పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని మహాప్రభు జగన్నాథుని ఆశీర్వాదాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరుకుంటూ, ప్రజలతో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు.
‘‘దేవదేవ జగన్నాథ సురాసురనమస్కృత
పుణ్యశ్లోకావ్యయానన్త పరమాత్మన్నమోస్తుతే’’.
భగవాన్ జగన్నాథుని దివ్య కృప దేశ ప్రజలందరి జీవితాల్లో కొత్త శక్తిని నింపుతుందన్న ఆశాభావాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
మహాప్రభు జగన్నాథ్ పావన రథ యాత్ర సందర్భంగా ఆ భగవానుని ఆశీర్వాదాలు మనందరికీ ఎల్లప్పుడూ లభిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. భగవానుని దివ్య కృప దేశవాసులందరి జీవితాల్లో కొత్త శక్తిని ప్రసరింపచేయు గాక.
దేవదేవ జగన్నాథ సురాసురనమస్కృత
పుణ్యశ్లోకావ్యయానన్త పరమాత్మన్నమోస్తుతే’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2285249)
आगंतुक पटल : 9