ప్రధాన మంత్రి కార్యాలయం
పవిత్ర రథయాత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 JUL 2026 10:37AM by PIB Hyderabad
పవిత్ర రథయాత్ర సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రథయాత్ర శాశ్వతమైన భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి అద్భుతమైన వ్యక్తీకరణ అనీ, వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవకు ప్రతీక అనీ శ్రీ మోదీ అభివర్ణించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు
పవిత్ర రథయాత్ర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇది భారతదేశపు శాశ్వతమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి గొప్ప నిదర్శనం. రథయాత్రతో ముడిపడి ఉన్న సంప్రదాయాలు... దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలకు స్ఫూర్తినిస్తున్నాయి. అవి వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలుస్తాయి.
మహాప్రభు జగన్నాథుడు అందరికీ మంచి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ ప్రసాదించుగాక! ఆయన మన ప్రయత్నాలన్నింటికీ బలాన్నిచ్చి, మన సమాజంలో ఐకమత్య స్ఫూర్తిని పెంపొందించుగాక.
జై జగన్నాథ్!
(రిలీజ్ ఐడి: 2285248)
సందర్శకుల సూచీ సంఖ్య : : 46
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam