బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో బొగ్గు ఎక్స్ఛేంజ్ వ్యవస్థ బలోపేతం: రిజిస్ట్రేషన్ దిశగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం


రిజిస్ట్రేషన్ దరఖాస్తుల స్వీకరణ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి

प्रविष्टि तिथि: 15 JUL 2026 8:03PM by PIB Hyderabad

   దేశంలో బొగ్గు ఎక్స్ఛేంజ్‌ వ్యవస్థ బలోపేతం దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇవాళ న్యూఢిల్లీలో ‘ఇండియన్ మైనింగ్ వీక్-2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ఛేంజీల రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తుల స్వీకరణను బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబేతోపాటు కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవదత్ కూడా ఇందులో పాల్గొన్నారు. అర్హులైన దరఖాస్తుదారులు ప్రాధికార సంస్థ నియంత్రణ-పర్యవేక్షణలో రిజిస్ట్రేషన్ కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకోవచ్చునని ఆహ్వానం జారీ అయింది. తద్వారా బొగ్గు ఎక్స్ఛేంజీల కోసం దేశం విధాన చట్రం నుంచి కార్యాచరణ సంసిద్ధత వైపు రూపాంతరం చెందడాన్ని ఇది సూచిస్తుంది. దేశీయ బొగ్గు మార్కెట్‌ ఆధునికీకరణ దిశగా ఇదొక కీలక మలుపు.

కోల్ ఎక్స్ఛేంజ్ అనేది ఒక ఆన్‌లైన్ వేదిక... దీని ద్వారా బొగ్గు, దాని శుద్ధి చేసిన ఉత్పత్తులపై ప్రాధికార సంస్థ ఆమోదించిన విధానంలో కొనుగోలుదారులు, అమ్మకందారులు లావాదేవీలు నిర్వహించవచ్చు. అలాగే, వ్యాపారంతోపాటు సరఫరా  ఆధారిత బొగ్గు ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఇది పారదర్శక మార్కెట్ ఆధారిత ధరల నిర్ధారణను, అథారిటీ ఆమోదించిన బొగ్గు నమూనా ఏజెన్సీలు హామీ ఇచ్చిన నాణ్యతకు భరోసా ఇస్తుంది. అలాగే, అధునాతన మార్కెట్ పర్యవేక్షణను, సెటిల్‌మెంట్ నిధి మద్దతుతో సురక్షిత క్లియరింగ్-సెటిల్‌మెంట్ ప్రక్రియను సుసాధ్యం చేస్తుంది. దీంతోపాటు సమర్థ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఏర్పాటుకు దోహదం చేస్తుంది. తద్వారా ఇది బొగ్గు అమ్మకందారులు-కొనుగోలుదారులు, ఇతర మార్కెట్ భాగస్వాములను అనుసంధానించే ఒక పటిష్ట, తటస్థ, పోటీతత్వ వేదికను సృష్టిస్తుంది. సంప్రదాయ నమూనాల నుంచి ఆధునిక వాణిజ్య వేదికకు మారడం ద్వారా బొగ్గు ఎక్స్ఛేంజ్‌ల ఏర్పాటు ఈ విపణిలో కొత్త ఒరవడిని సృష్టిస్తుంది.

గనులు-ఖనిజాల (అభివృద్ధి-నియంత్రణ) సవరణ చట్టం-2025 ద్వారా కోల్ ఎక్స్ఛేంజీల ఏర్పాటుకు వెసులుబాటు కలిగింది. ఆ మేరకు ఖనిజ ఎక్స్ఛేంజీల భావనను ఈ చట్టం పరిచయం చేసింది. ఈ సంస్కరణకు అనుగుణంగా కోల్ ఎక్స్ఛేంజీల ఏర్పాటు.. నిర్వహణ-నియంత్రణ చట్రం ఏర్పరుస్తూ బొగ్గు మంత్రిత్వశాఖ ‘కోల్ ఎక్స్ఛేంజ్ నిబంధనలు-2026ను జారీ చేసింది.

బొగ్గు ఎక్స్ఛేంజీల నమోదు-పర్యవేక్షణ నిమిత్తం బొగ్గు నియంత్రణ ప్రాధికార సంస్థ (సీసీఓ) ఏర్పాటైంది. ఈ సంస్థ ఆమోదంతో ఎక్స్ఛేంజీల ఏర్పాటు, నిర్వహణ, మార్కెట్ నియమాల రూపకల్పన సహా బొగ్గు వ్యాపార సౌలభ్యం దిశగా అర్హతగల సంస్థలకు అనుమతి లభిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్‌ 25 ఏళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలిక సంస్థాగత స్థిరత్వానికి భరోసా ఉంటుంది. మార్కెట్ ఆధారిత ధరల నిర్ధారణకు  ప్రోత్సాహం ద్వారా వ్యాపార సౌలభ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా పారదర్శకతను పెంచుతుంది. ఒక ఆధునిక-సమర్థ బొగ్గు మార్కెట్ సహా సరఫరా వ్యవస్థ పునరుత్థానాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, మరింతగా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆకర్షిస్తూ పారిశ్రామిక వృద్ధికి తోడ్పడుతుంది.

బొగ్గు ఎక్స్ఛేంజీ నిబంధనలు-2026 ప్రచురితమైన ఒక నెల వ్యవధిలోనే దరఖాస్తు ప్రక్రియ, రిజిస్ట్రేషన్‌ సంబంధిత అంశాలపై ‘సీసీఓ’ వివరణాత్మక మార్గదర్శకాలను రూపొందించింది. దరఖాస్తు ప్రక్రియను సరళం చేస్తూ, దరఖాస్తుదారులకు ఆమూలాగ్రం తోడ్పడటానికి ఒక సమగ్ర వినియోగదారు చట్రం సహిత ఆన్‌లైన్ పోర్టల్ కూడా ఏర్పాటైంది.

ఈ దరఖాస్తుల కోసం www.coalcontroller.gov.in/coalexchange ద్వారా పోర్టల్‌ను వినియోగించుకోవచ్చు. ఇందులో దరఖాస్తుదారుల కోసం పూర్తి డిజిటల్ సదుపాయంతో  సమగ్ర సౌలభ్యం ఉంటుంది. ఆసక్తిగలవారు భారత్‌కోష్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడంతోపాటు  సహాయక పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు. నిర్దేశిత రుసుముల చెల్లింపు ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. అనంతరం ప్రతి దశలోనూ పారదర్శకంగా తమ దరఖాస్తుల వాస్తవ స్థితిని నేరుగా తెలుసుకోవచ్చు.

ఇంధన భద్రత, ఆర్థిక స్వావలంబన దిశగా భారత్‌ తన ప్రస్థానం కొనసాగిస్తున్న నేపథ్యంలో సమర్థ, పోటీతత్వ, మార్కెట్ అవసరానుగుణ, భవిష్యత్ సంసిద్ధ బొగ్గు రంగానికి రూపమివ్వడంలో కోల్ ఎక్స్ఛేంజీలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశం ‘వికసిత భారత్’ స్వప్న సాకార లక్ష్యానికి తగినట్లు నియంత్రిత, పోటీతత్వ సహిత భవిష్యత్ సన్నద్ధ బొగ్గు విపణిని రూపుదిద్దడంలో తొలి దశను ఈ ప్రారంభోత్సవం స్పష్టం చేసింది.

 

***


(रिलीज़ आईडी: 2285213) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी