గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల ఎనిమిదో విడత వేలాన్ని ప్రారంభించనున్న కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ

प्रविष्टि तिथि: 14 JUL 2026 5:56PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో జూలై 15, 2026న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డిబొగ్గుగనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబేతో పాటు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులుఇతర ప్రముఖులు కలిసి వ్యూహాత్మకకీలక ఖనిజాల బ్లాకుల వేలం ఎనిమిదో విడతను ప్రారంభిస్తారు.

ఎనిమిదో విడత ద్వారా రాష్ట్రాల్లో విస్తరించిన 20 కీలకవ్యూహాత్మక ఖనిజ బ్లాకులను చేర్చారువీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులురెండోసారి వేలం వేస్తున్న బ్లాకులు ఉన్నాయిమాలిబ్డినంగ్రాఫైట్గ్లకోనైట్అరుదైన మృత్తికా మూలకాలు (ఆర్ఈఈ), వెనెడియంగాలియంటైటానియంటంగ్‌స్టన్‌పాస్పరైట్పొటాష్లిథియంసిీసియంరుబీడియం వంటివి ఈ ఖనిజాల జాబితాలో ఉన్నాయిఇవి స్వచ్ఛ ఇంధనంఅధునాతన తయారీ రంగంఎరువులురక్షణఇతర వ్యూహాత్మక రంగాలకు కీలకమైనవి.

ఏడు విడతల్లో వేలం ప్రక్రియ విజయవంతంగా పూర్తవటంతోవేలం కోసం చేపట్టిన 88 కీలకవ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను గనుల మంత్రిత్వ శాఖ విజయవంతంగా విక్రయించిందిదీని ద్వారా విజయాల రేటు 63 శాతానికి పైగా నమోదైందివరుసగా జరిగిన వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన.. ప్రభుత్వ పారదర్శకపోటీతత్వమార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందిఆర్థిక వృద్ధిసాంకేతిక పురోగతిస్వచ్ఛ ఇందన పరివర్తనకు కీలక ఖనిజ వనరులను భద్రపరచుకోవటంలో భారతదేశ ప్రయత్నాలకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తోంది.

వేలం విధానం ప్రారంభమైనప్పటి నుంచి 20205-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 212 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం వేయటం ద్వారా ఖనిజ రంగం కీలక ఘట్టాన్ని నమోదు చేసిందిఇందులో 22 కీలకవ్యూహాత్మక ఖనిజ బ్లాకులు కూడా ఉన్నాయిభారతదేశ ఆర్థిక వృద్ధిసాంకేతిక పురోగతిస్వచ్ఛ ఇంధన పరివర్తనకు అత్యంత అవసరమైన కీలక ఖనిజ వనరులను భద్రపరచటంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను ఇది స్పష్టం చేస్తోంది.

వేలం ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఖనిజాల (వేలంనియమాలు-2026 సవరణలను ప్రకటించిందిఈ సంస్కరణలు ముందస్తు మొత్తాన్ని చెల్లించే సమయ పరిమితిని మరింత సులభతరం చేశాయిగనులను లీజుకివ్వటంఅన్వేషణ లైసెన్స్ ఒప్పందాల అమలులో మరింత సౌలభ్యాన్ని కల్పిస్తాయిబిడ్డర్ల తప్పిదం కాకుండా ఇతర కారణాల వల్ల వేలం రద్దయితే... బిడ్ సెక్యూరిటీపర్ఫార్మెన్స్ సెక్యూరిటీఇతర చెల్లింపులను సకాలంలో తిరిగి చెల్లించేందుకు ఇవి వీలు కల్పిస్తాయిసులభతర వ్యాపార నిర్వహణపెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచటంవేలం వేసిన ఖనిజ బ్లాకులను వేగంగా వినియోగంలోకి తీసుకురావటమే లక్ష్యంగా ఈ చర్యలను తీసుకున్నారు.

 

***


(रिलीज़ आईडी: 2284664) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी