మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ జలాల్లో సుస్థిర మత్స్య సంపద వినియోగానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని, ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ పత్రాన్ని విడుదల చేయనున్న భారత ఉప రాష్ట్రపతి


మత్స్య సహకార సంఘాలు, ఎఫ్ఎఫ్‌పీఓల ద్వారా మత్స్య రంగానికి ప్రోత్సాహం

प्रविष्टि तिथि: 08 JUL 2026 7:50AM by PIB Hyderabad

భారత ప్రభుత్వ మత్స్య శాఖ ఆధ్వర్యంలో జూలై 9, 2026న ఒడిశాలోని భువనేశ్వర్‌లో అంతర్జాతీయ జలాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని (ఎల్ఓఏవిడుదల చేసేందుకు జాతీయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారుఅంతర్జాతీయ జలాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని భారత గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ విడుదల చేయనున్నారుఈ సందర్భంగా ఒడిశా డీప్ సీ మిషన్ పత్రాన్ని కూడా ఉప రాష్ట్రపతి విడుదల చేస్తారు.

ఈ జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ గౌరవ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ఒడిశా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ మోహన్ చరణ్ మాఝీకేంద్ర మత్స్యపశు సంవర్ధకపాడి పరిశ్రమపంచాయతీ రాజ్ శాఖ మంత్రి గౌరవ శ్రీ రాజీవ్ రంజన్ సింగ్కేంద్ర విద్యాశాఖ మంత్రి గౌరవ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారువీరితో పాటు కేంద్ర మత్స్యపశు సంవర్ధకపాడి పరిశ్రమపంచాయతీ రాజ్ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్.పీసింగ్ బఘేల్ఒడిశా ప్రభుత్వ మత్స్యఏఆర్‌డీఎంఎస్ఎంఈ శాఖల సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యతశ్రీ గోకులానంద మల్లిక్భువనేశ్వర్ ఎంపీ శ్రీమతి అపరాజిత సారంగికంధమాల్ ఎంపీ శ్రీ సుకాంత పాణిగ్రాహిఖుర్దా ఎమ్మెల్యే శ్రీ ప్రశాంత కుమార్ జగదేవ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారుఈ వేడుకలో ఒడిశా ప్రభుత్వంసంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలుఇతర విభాగాల అధికారులతో పాటుమహిళా మత్స్యకారులతో కలిసి సుమారు 1,000 మంది చేపలు సాగు చేసేవారుమత్స్యకారులు పాల్గొంటారు.

వివిధ కార్యక్రమాల ద్వారా మత్స్య రంగం డిజిటలైజేషన్‌పై దృష్టి సారించటంతో పాటు మత్స్యకార రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ఎఫ్‌పీఓ), మత్స్యకార సహకార సంఘాలను బలోపేతం చేయటానికి భారత ప్రభుత్వ మత్స్య శాఖ ప్రాధాన్యతనిస్తోంది.

నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్)తో సహా మత్స్యకార సహకార సంఘాలకుఫిషింగ్ నౌకల యజమానులకు ఎల్ఓఏను ఉప రాష్ట్రపతి అందిస్తారుభారతదేశానికి చెందిన అర్హత గల ఫిషింగ్ నౌకలకు అంతర్జాతీయ జలాల్లో నియంత్రిత చేపల వేటకు ఇది వీలు కల్పిస్తుందిశ్రీ మహావీర్ మచ్చిమార్ సహకారి మండలి లిమిటెడ్శ్రీ మార్తాండ ప్రసన్న కొలాబా మత్స్యోద్యోగ వివిధ కార్యకారి సహకారి సంస్థ మర్యాదిత్సౌత్ గోవా మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ కో-ఆపరేటివ్మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్పారాదీప్ మెరైన్ ప్రైమరీ ఫిష్ ప్రొడక్షన్మార్కెటింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్తెంగపట్టణం డీప్ సీ ఫిష్ ప్రొడ్యూసర్స్ కో-ఆపరేటివ్ సొసైటీమాల్పే ఫిషర్ మెన్స్ ప్రైమరీ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వంటి మత్స్యకార సహకార సంఘాలు అవార్డులు అందుకోనున్నాయిఈ సంఘాలకు ఎల్ఓఏను అందిస్తారు.

భారతదేశ మత్సకార నౌకల ద్వారా అంతర్జాతీయ జలాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలు-2025 ప్రకారం అధికారిక పత్రాన్ని (ఎల్ఓఏపొందటం తప్పనిసరి నిబంధనఅంతర్జాతీయ జలాల్లో వేటచేపల వేటకు సంబంధించి కార్యకలాపాల్లో పాల్గొనే భారత ఫిషింగ్ నౌకల కోసం పారదర్శకమైనబాధ్యతాయుతమైన వ్యవస్థగా దీన్ని రూపొందించారునిర్దిష్ట నౌకకు మాత్రమే ఎల్ఓఏ వర్తిస్తుందివేరొకరికి బదిలీ చేసేందుకు వీలుండదుఇది రియల్‌క్రాఫ్ట్ మత్స్యకార నౌకల నమోదు పోర్టల్‌తో అనుసంధానమై ఉంటుందిక్రమబద్ధమైనగుర్తించదగినపర్యవేక్షించగలిగే కార్యకలాపాలను ఇది చూసుకుంటుందికనీస ఖర్చుతో ఎలాంటి కఠినమైన నిబంధనలు లేకుండాఎప్పటికప్పుడు అప్లికేషన్ ట్రాకింగ్ సదుపాయంతో అందుబాటులో ఉండే ఈ ఎల్ఓఏ.. మత్స్యకారులకుపడవల నిర్వాహకులకు నిబంధనలను సులువుగా పాటించేందుకు సహాయపడుతుందిఎల్ఓఏ పొందిన నౌకలు సంబంధిత ప్రాంతీయ మత్స్య నిర్వహణ సంస్థలు (ఆర్ఎఫ్ఎంఓలుసూచించిన రక్షణనిర్వహణ చర్యలను తప్పనిసరిగా పాటించాలిఇందులో భాగంగా చేపల వేట పరిమితులువేట పరికరాల నిబంధనలుఇతర జీవుల మరణాల తగ్గింపు చర్యలుఫిష్ అగ్రిగేటింగ్ డివైజ్ (ఎఫ్ఏడీనిర్వహణప్రయాణ నివేదికలుబాధ్యతాయుతమైనస్థిరమైన చేపల వేట కోసం అవసరమైన ఇతర నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

లోతైన, అంతర్జాతీయ సముద్ర జలాల్లో స్థిరమైన పద్ధతుల్లో చేపల వేట సాగించేందుకు మత్స్యకార రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ఎఫ్‌పీఓ), మత్స్యకార సహకార సంఘాలను ఎల్ఓఏ మరింత బలోపేతం చేస్తుందిదీని వల్ల అధిక విలువ గల సముద్ర వనరులు లభించిమత్స్యకారుల ఆదాయం పెరుగుతుందిఎల్ఓఏ ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా జరుగుతుందిఈ ప్రక్రియ పారదర్శకంగానిర్ణీత సమయానికి పూర్తవుతుందితద్వారా మత్స్య రంగంలో సేవలందించటం సులువవుతుందిపారదర్శకతచేపల నాణ్యతను గుర్తించటంసుపరిపాలన మెరుగవుతాయి.

ఒడిశా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక బ్లూ ఎకానమీ కార్యక్రమమే ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ (2026–2036). రాష్ట్రంలోని తీరప్రాంతలోతైన సముద్ర మత్స్య సంపద సామర్థ్యాన్ని వెలికితీయటానికిఒడిశాను లోతైన సముద్ర చేపల వేటసముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రముఖ కేంద్రంగా మార్చటమే ఈ మిషన్ ఉద్దేశంఆధునిక మత్స్య పరిశ్రమ మౌలిక సదుపాయాలువిలువ ఆధారిత వ్యవస్థలుశాస్త్రీయ మత్స్య నిర్వహణమార్కెట్ అనుసంధానాల్లో పెట్టుబడుల ద్వారా చేపల ఉత్పత్తిని పెంచేందుకుఉపాధి అవకాశాలను కల్పించేందుకుమత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించేందుకుసముద్ర మత్స్య రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించేందుకు ఈ మిషన్ సహకరిస్తుంది.

భారత ఫిషింగ్ నౌకలు భారతదేశ ఈఈజడ్ పరిధికి అవతల ఉన్న ప్రాంతాల్లో చేపల వేటను సాగించేందుకు వీలుగా... క్రమబద్ధమైనపారదర్శకమైనస్థిరమైన వ్యవస్థకు ఈ అధికారిక పత్రం (ఎల్ఓఏ), ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంట్ కీలకంగా నిలుస్తాయిఇది అంతర్జాతీయ సముద్ర జలాల్లో స్థిరమైనబాధ్యతాయుతమైన మత్స్య సంపద సేకరణ దిశగా భారతదేశ ఫిషింగ్ నౌకలకు సాధికారత చేకూరుస్తుందిఅంతర్జాతీయ సముద్ర జలాల్లో మత్స్య వనరులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవటంమత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయటంసముద్ర ఆహార ఎగుమతులను పెంచటంప్రపంచ సుస్థిర ప్రమాణాలకు కట్టుబడి ఉండటంసంపన్నమైనసమ్మిళిత బ్లూ ఎకానమీ.. జాతీయ దార్శనికతను ముందుకు తీసుకెళ్లటం పట్ల భారతదేశానికున్న నిబద్ధతకు ఇది నిదర్శనం.

నేపథ్యం

భారతదేశానికి సుమారు 11,099 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతందాదాపు 24 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలిలో విస్తారమైనవిభిన్నమైన సముద్ర వనరులున్నాయిభారతదేశపు ఈఈజడ్ పరిధిలోని సముద్ర మత్స్య సంపద సామర్థ్యం 58.6 లక్షల ఎంటీ ఉన్నట్లు అంచనాఇది సుమారు 50 లక్షల మంది మత్స్యకారుల జీవనోపాధికి మద్దతివ్వటమే కాకుండా.. ఆహార భద్రతపోషకాహారంఉపాధిఆదాయంఎగుమతి రాబడికి దోహదపడుతుందిప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చేపల వేటఅక్వాకల్చర్ రంగాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి సుమారు రూ.73,890 కోట్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి జరిగింది.

చాలా మత్స్యకార కార్యకలాపాలు తీరానికి 40-50 నాటికల్ మైళ్ల పరిధిలోనే జరుగుతాయిఅయితే లోతైన జలాలుదేశ సరిహద్దులకు అవతల ఉన్న ప్రాంతాల్లో ట్యూనా వంటి అధిక విలువ గల చేపల వనరుల వేటకు ఎక్కువగా అవకాశాలున్నాయిస్థిరమైన సముద్ర మత్స్య పరిశ్రమ వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తిస్తూ... భారత ఈఈజడ్అంతర్జాతీయ జలాల నుంచి మత్స్య సంపదను స్థిరంగా వినియోగించుకునేందుకు అనువైన మార్గదర్శక నిబంధనలను భారత ప్రభుత్వం విడుదల చేసిందిఇందులో భారత మత్స్యకార నౌకల ద్వారా అంతర్జాతీయ జలాల్లో మత్స్య సంపదను స్థిరంగా వినియోగించుకునేందుకు సంబంధించిన మార్గదర్శకాలు-2025 కూడా ఉన్నాయి.

భారతదేశ ఈఈజడ్అంతర్జాతీయ జలాల నుంచి మత్స్య సంపదను పర్యావరణహితంగాస్థిరంగా వినియోగించుకునేందుకు అనుకూలమైన విధానాన్ని తీసుకురానున్నట్లు 2025-26 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందివ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత గల సుస్థిర సముద్ర మత్స్య రంగాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందిఇందులో భాగంగా భారతదేశ మొత్తం ఈఈజడ్ విస్తీర్ణంలో దాదాపు 49 శాతం వాటా ఉన్న అండమాన్నికోబార్ దీవులులక్షద్వీప్ వంటి ద్వీప భూభాగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారుసముద్ర మత్స్య రంగంలో ఇప్పటివరకు వినియోగించుకోని అపారమైన అవకాశాలను వెలికితీయటంతో పాటు... స్థిరత్వంసమానత్వంజాతీయ సముద్ర ప్రయోజనాలుమత్స్యకార వర్గాల దీర్ఘకాలిక జీవనోపాధి భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ ప్రకటన తెలియజేస్తోంది.

ఈ లక్ష్య సాధనలో భాగంగా డిసెంబర్ 9, 2025న భారత మత్స్యకార నౌకల ద్వారా అంతర్జాతీయ జలాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలు-2025 విడుదలయ్యాయిభారతదేశ ఈఈజెడ్ పరిధికి అవతల ఉన్న అంతర్జాతీయ జలాల్లో భారత మత్స్యకార నౌకల ద్వారా అధికారికనియంత్రితబాధ్యతాయుతమైన మత్స్యకార కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు విధానపరమైన చర్యల్లో ఈ నూతన మార్గదర్శకాలు కీలకంగా నిలుస్తాయిజాతీయ చట్టాలుఅంతర్జాతీయ బాధ్యతలుపరిరక్షణ నియమాలను పూర్తిగా పాటిస్తూనే.. జాతీయ అధికార పరిధికి అవతల ఉన్న ప్రాంతాల్లో అధిక-విలువైన సముద్ర మత్స్య సంపద రంగంలో భారత్ భాగస్వామ్యం వైపు సాగుతున్న ప్రయాణంలో ఈ విధాన రూపకల్పన కీలక ముందడుగుని సూచిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2282413) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी