వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆసియాన్-భారత్ సరకుల వాణిజ్య ఒప్పందం సంయుక్త సంఘం 13వ సమావేశాన్ని నిర్వహిస్తున్న భారత్ వాణిజ్య ఒప్పంద సమీక్షను వేగవంతం చేయడమే లక్ష్యం
మిగిలిన సమీక్ష అధ్యాయాలకు త్వరిత గతిన తుది రూపును ఇవ్వాలని ఆదేశించిన ఏఐటీఐజీఏ సంయుక్త సంఘం
प्रविष्टि तिथि:
08 JUL 2026 11:06AM by PIB Hyderabad
భారత్ 13వ ఆసియాన్-భారత్ సరకుల వాణిజ్య ఒప్పంద (ఏఐటీఐజీఏ) సంయుక్త సంఘం (జేసీ) సమావేశంతో పాటు సంబంధిత ఇతర సమావేశాలను 2026 జులై 6, 10 తేదీల మధ్య న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో నిర్వహిస్తోంది. దీనిలో ఏఐటీఐజీఏ సమీక్ష ప్రక్రియను చేపట్టి, సంప్రదింపుల్లో ఏమేరకు పురోగతి చోటు చేసుకుందో సమీక్షించారు. ఈ సమావేశాలను హైబ్రిడ్ ఫార్మేట్లో నిర్వహిస్తున్నారు.
ఏఐటీఐజీఏ సంయుక్త సంఘంలో భాగంగా ఉన్న అంతర్గత ఉప సంఘాల్లో నుంచి మూడు ఉప సంఘాలు ప్రస్తుత 13వ సంయుక్త సంఘ సమావేశాలతో పాటే భేటీ అవుతున్నాయి. ఈ మూడు సంఘాల్లోనూ కస్టమ్స్ ప్రక్రియలు, వాణిజ్య సౌలభ్య ఉప సంఘం (ఎస్‌సీ-సీపీటీఎఫ్), నేషనల్ ట్రీట్‌మెంట్ అండ్ మార్కెట్ యాక్సెస్ (ఎస్‌సీ-ఎన్‌టీఎమ్ఏ), మూలానికి సంబంధించిన నియమాల సంఘం (ఎస్‌సీ-ఆర్‌ఓఓ) ఉన్నాయి.
ఈ సమావేశాలు భారత్, ఆసియాన్ మధ్య సహకారాన్ని విస్తరింప చేసుకొనే, పరస్పర అవగాహనను పెంపొందించుకొనే, నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహించుకొనేందుకు ఒక ముఖ్య వేదికగా ఉంటున్నాయి.
ఉప సంఘాలకు వాటికి సంబంధించిన రంగాలలో వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని సంయుక్త సంఘం అందించింది. ఏఐటీఐజీఏ సమీక్షలో భాగంగా మిగిలిన అధ్యాయాలకు కూడా త్వరగా తుది రూపురేఖలను ఇవ్వాల్సిందిగా ఉపసంఘాలకు సూచించారు. సంప్రదింపులు పురోగమించేటట్లు చూడడానికి ఉప సంఘాలకు నిర్ణీత కాల లక్ష్యాలను నిర్దేశించారు. అంగీకారం కుదిరిన గడువు లోపల ఖచ్చిత ఫలితాలను రాబట్టడానికి వీలుగా కలిసికట్టుగా పనిచేయాల్సిందిగా కూడా ఉప సంఘాలను ప్రోత్సహించారు.
ఈ నెల 7న నిర్వహించిన 13వ ఏఐటీఐజీఏ సంయుక్త సంఘం సమావేశానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన వాణిజ్య విభాగ అదనపు కార్యదర్శి శ్రీ నితిన్ కుమార్ యాదవ్‌తో పాటు మలేషియాకు చెందిన పెట్టుబడి, వాణిజ్యం, వ్యాపార మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ జనరల్ మస్తురా అహ్మద్ ముస్తఫా సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆసియాన్‌కు చెందిన అన్ని సభ్యదేశాలు.. అంటే బ్రూనై, కంబోడియా, ఇండొనేషియా, లావో పీడీఆర్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నామ్.. ప్రతినిధి వర్గాలు పాల్గొన్నాయి.
భారత్‌కు చెందిన కీలక వాణిజ్య భాగస్వాముల్లో ఆసియాన్ ఒకటి. దీనికి భారత్ అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు 11 శాతం వాటా ఉంది. భారత్, ఆసియాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 2025-26 లో 128 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయికి చేరింది. ఇది ఈ రెండు పక్షాల బలమైన ఆర్థిక భాగస్వామ్యానికి అద్దం పట్టింది. అంతేకాదు.. వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని మరింత ఎక్కువగా విస్తరించుకొనేందుకు తగిన అవకాశాలను కూడా అందించింది.
***
(रिलीज़ आईडी: 2282392)
आगंतुक पटल : 15