రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ నౌకాదళానికి చెందిన నౌకల సింగపూర్ యాత్ర విజయవంతం
प्रविष्टि तिथि:
05 JUL 2026 4:58PM by PIB Hyderabad
భారత నౌకాదళ నిర్వహణ పూర్వక మోహరింపులో భాగంగా, తూర్పు నౌకాదళానికి చెందిన ‘ఉదయగిరి’, ‘శక్తి’లతో పాటు ‘కవరత్తి’లు రియర్ అడ్మిరల్ ఆలోక్ ఆనంద్ నాయకత్వంలో సింగపూర్లోని చాంగీ నౌకాదళ స్థావరానికి నౌకాశ్రయ యాత్రను విజయవంతంగా ముగించాయి. ఈ కార్యక్రమం భారత్, సింగపూర్ పక్షాల మధ్య వ్యూహాత్మక, నౌకావాణిజ్య భాగస్వామ్యాన్ని దృఢతరం చేసింది.
ఆసియాన్-భారత్ నౌకావాణిజ్య సహకార సంవత్సరం, భారత్ ప్రభుత్వ ‘యాక్ట్ ఈస్ట్ విధానం’ లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు సాగింది. రెండు నౌకాదళాల మధ్య అంతరనిర్వహణీయతనీ, నౌకాదళ సంబంధిత సహకారాన్నీ పటిష్ఠపరుచుకొనే ఉద్దేశంతో క్రాస్-డెక్ యాత్రలు సహా అనేక వృత్తి నైపుణ్య ప్రధాన సమావేశాలను నిర్వహించారు. ఐఎన్ఎస్ కవరత్తిని పాఠశాల విద్యార్థులు చూశారు. వారు నౌకాదళ కార్యకలాపాలు, యుద్ధనౌకలో జీవితం, భారతీయ నౌకాదళానికి మార్గదర్శకంగా ఉండే విలువల గురించి తెలుసుకున్నారు.
విజయవంతంగా ముగిసిన ఈ కార్యక్రమం భారత్, సింగపూర్ మధ్య అంతకంతకు విస్తరిస్తున్న నౌకావాణిజ్య సహకారంలో మరో కీలక ప్రగతి ప్రస్థానాన్ని సూచిస్తోంది. నౌకాశ్రయం వద్ద నిర్వహించిన సమావేశాలతో వృత్తినైపుణ్యానికి సంబంధించిన అవగాహనను పెంపొందింప చేసుకోవడం, నిర్వహణ కార్యకలాపాల పరంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో శాంతినీ, సుస్థిరత్వాన్నీ, భద్రతనీ పరిరక్షించడానికి ఉమ్మడి ప్రయత్నాల్ని ప్రోత్సహించుకోవడానికీ తోడ్పాటు లభించినట్లయింది.
***
(रिलीज़ आईडी: 2281442)
आगंतुक पटल : 9