బొగ్గు మంత్రిత్వ శాఖ
దిగుమతి ప్రత్యామ్నాయం దిశగా స్థిరమైన పురోగతిని ప్రతిబింబిస్తూ... 2026 ఏప్రిల్ నెలలో 13 శాతం తగ్గిన బొగ్గు దిగుమతులు
प्रविष्टि तिथि:
02 JUL 2026 5:08PM by PIB Hyderabad
భారత బొగ్గు దిగుమతుల పరిమాణం గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో 24.27 మిలియన్ టన్నులు (ఎమ్‌టీ)గా ఉన్న దిగుమతులు, 2026 ఏప్రిల్ నాటికి 21.13 ఎమ్‌టీకి పడిపోయాయి. ఇది 3.14 ఎమ్‌టీ (సుమారు 12.95 శాతం) తగ్గుదలను సూచిస్తోంది. ముఖ్యంగా విద్యుత్ రంగం కోసం దిగుమతుల ప్రత్యామ్నాయం, దేశీయ బొగ్గు లభ్యతను పెంచడం లక్ష్యంగా బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతర కృషి ప్రభావాన్ని ఈ తగ్గుదల ప్రతిబింబిస్తుంది.
ముఖ్యాంశాలు
భారీగా తగ్గిన విద్యుత్ రంగ దిగుమతులు: మెరుగైన దేశీయ అనుసంధాన సరఫరాలు, మిశ్రమం కోసం దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడటం తగ్గడం వల్ల, విద్యుత్ ప్లాంట్ల బొగ్గు దిగుమతులు ఏప్రిల్ 2025లోని 4.67 మిలియన్ టన్నుల నుంచి ఏప్రిల్ 2026లో 3.51 మిలియన్ టన్నులకు, అంటే 24.89 శాతం తగ్గాయి.
దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత (ఐసీబీ) ప్లాంట్లు: దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచేలా రూపొందించిన ప్లాంట్ల దిగుమతులు 27.45 శాతం మేర తగ్గి, 3.97 ఎమ్‌టీ నుంచి 2.88 ఎమ్‌టీకి పడిపోయాయి. పర్యవేక్షించిన అన్ని వర్గాల్లో ఇదే అత్యంత తీవ్రమైన తగ్గుదల.
దిగుమతి చేసుకున్న బొగ్గు మిశ్రమం కోసం దేశీయ బొగ్గు ఆధారిత (డీసీబీ) ప్లాంట్లు: దేశీయ ప్లాంట్ల ద్వారా మిశ్రమం కోసం దిగుమతి చేసుకున్న బొగ్గు 11.26 శాతం తగ్గుదలతో, 0.71 ఎమ్‌టీ నుంచి 0.63 ఎమ్‌టీకి పడిపోయింది. ఇది నమ్మకమైన దేశీయ సరఫరాను పెంచడానికి, మిశ్రమం తప్పనిసరి అనే ఆదేశంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నాల విజయాన్ని స్పష్టం చేస్తోంది.
మొత్తంగా దిగుమతులపై ఆధారపడటం తగ్గింది: మొత్తం బొగ్గు వినియోగంలో దిగుమతుల వాటా ఏప్రిల్ 2025లో 21.69 శాతం ఉండగా, ఏప్రిల్ 2026లో 19.68 శాతానికి తగ్గింది. ఇది 2 శాతానికి పైగా పాయింట్ల తగ్గుదలను సూచిస్తోంది.
స్థిరంగా కోకింగ్ బొగ్గు దిగుమతులు: దేశీయ కోకింగ్ బొగ్గు నిల్వలు పరిమితంగా ఉన్న ఉక్కు రంగానికి ప్రధానంగా సేవలందించే కోకింగ్ బొగ్గు దిగుమతులు... దేశీయ ఉక్కు ఉత్పత్తిలో నిరంతర వృద్ధికి అనుగుణంగా 1.34 శాతం (5.93 ఎమ్‌టీ నుంచి 6.01 ఎమ్‌టీకి) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఈ పెరుగుదల లభ్యతలోని అంతరాల వల్ల కాకుండా, వనరుల-నిర్దిష్ట అవసరాల వల్లే సాధ్యమైందని ఇది స్పష్టం చేస్తోంది.
ఐసీబీ, డీసీబీ, మొత్తం దిగుమతి వర్గాల్లో స్థిరంగా కనిపిస్తున్న తగ్గుదల... దేశీయంగా బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడం, ఫస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడం, థర్మల్ పవర్ ప్లాంట్ల నిల్వలను నిశితంగా పర్యవేక్షించడం, విద్యుత్ సంస్థలకు నిరంతరాయ సరఫరాను నిర్ధారించడం, రైల్వే మంత్రిత్వ శాఖ, కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) సహా దాని అనుబంధ సంస్థలతో సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతరం దృష్టి సారించడాన్ని ప్రతిబింబిస్తుంది. మిశ్రమం (బ్లెండింగ్) ప్రయోజనాలు సహా, దిగుమతి చేసుకున్న బొగ్గు అవసరాన్ని ఈ చర్యలు క్రమంగా తగ్గించాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్లలో ఆరోగ్యకరమైన నిల్వలను కొనసాగించాయి. రాబోయే నెలల్లో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే ఈ ధోరణిని కొనసాగించడానికి... దేశీయ బొగ్గు ఉత్పత్తి, తరలింపు మౌలిక సదుపాయాలు, నాణ్యత ఆధారిత గ్రేడింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
(रिलीज़ आईडी: 2280563)
आगंतुक पटल : 10