రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నైరుతి వైమానిక దళం ఎయిర్ కమాండ్ గా బాధ్యతలు చేపట్టిన ఎయిర్ మార్షల్ పి.వి. శివానంద్

प्रविष्टि तिथि: 01 JUL 2026 8:33PM by PIB Hyderabad

నైరుతి (సౌత్ వెస్టర్న్) వైమానిక దళం ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా ఎయిర్ మార్షల్ పి.వి. శివానంద్ (ఏవీఎస్ఎం, వీఎం)   2026 జూలై 01న బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. డిసెంబర్ 1988లో భారత వైమానిక దళంలోని యుద్ధ విమాన విభాగంలో  చేరిన శివానంద్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, , టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్,  వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయనకు మిగ్-21, ఇల్యూషిన్ ఐఎల్ -76 అవాక్స్ (ఐఎల్ -76 అవాక్స్) విమానాలపై 2800 గంటలకు పైగా సుదీర్ఘ విమాన ప్రయాణ అనుభవం ఉంది.

తన విశిష్టమైన సేవా కాలంలో ఆయన ఎన్నో కీలకమైన కమాండ్, స్టాఫ్ బాధ్యతలను నిర్వహించారు. ఇందులో భాగంగా, అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గల భారత రాయబార కార్యాలయంలో డిఫెన్స్ అండ్ ఎయిర్ అటాచ్  గా దౌత్యపరమైన బాధ్యతలను చేపట్టారు. అదే సమయంలో కెనడా దేశానికి కూడా ఏకకాలంలో అధికారిక ప్రతినిధిగా వ్యవహరించారు. భారత వైమానిక దళానికి చెందిన రెండు ఫ్రంట్‌లైన్ స్క్వాడ్రన్‌లకు, తూర్పు సెక్టార్‌లోని ఒక ప్రముఖ వైమానిక స్థావరానికి  కమాండర్‌గా నాయకత్వం వహించారు. ఎస్డబ్ల్యూఏసీ హెడ్‌క్వార్టర్స్,  ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లలో ఎయిర్ ఆపరేషన్స్, ఎయిర్ డిఫెన్స్, ఎయిర్‌బోర్న్ సెన్సార్స్ అండ్ నెట్‌వర్కింగ్ వంటి విభాగాలలో ప్రత్యేక నైపుణ్యంతో కూడిన పలు కీలకమైన స్టాఫ్ బాధ్యతలను కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించారు.

దేశ నిఘా సామర్థ్యాలను  సమగ్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను గణనీయంగా పెంపొందించే కీలకమైన వేదికల నిర్వహణను, పలు వైమానిక రక్షణ కార్యక్రమాలను ఆయన ముందుండి నడిపించారు.  సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ బాధ్యతలను స్వీకరించడానికి ముందు హెడ్‌క్వార్టర్స్ సెంట్రల్ ఎయిర్ కమాండ్ లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా ఆయనే బాధ్యతలు నిర్వహించారు.

ఎయిర్ మార్షల్ తేజీందర్ సింగ్ (పీవీఎస్ఎం, ఏవీఎస్ఎం, వీఎం) స్థానంలో శివానంద్ ఈ బాధ్యతలను స్వీకరించారు. ఎయిర్ మార్షల్ తేజీందర్ సింగ్ 2026 జూలై 01న హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌లో  చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ టు ది ఛైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ  గా నియమితులయ్యారు.

 

***


(रिलीज़ आईडी: 2280291) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati