ప్రధాన మంత్రి కార్యాలయం
కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లాకు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
26 JUN 2026 10:47PM by PIB Hyderabad
కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
కొలంబియాతో ఉన్న స్నేహబంధానికి భారత్ ఎంతో విలువనిస్తుందని, ఈ బంధం అన్ని రంగాల్లోనూ నిరంతరం బలపడుతూనే ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. "విజయవంతమైన పదవీకాలాన్ని పూర్తి చేయాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాబోయే ఏళ్లలో మన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయటానికి ఆసక్తిగా ఉన్నాను" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లాకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
కొలంబియాతో ఉన్న స్నేహ బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుంది. ఈ బంధం అన్ని రంగాల్లోనూ నిరంతరం బలపడుతోంది. మీ పదవీకాలం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాబోయే ఏళ్లలో మన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా.
@ABDELAESPRIELLA
(రిలీజ్ ఐడి: 2278527)
సందర్శకుల సూచీ సంఖ్య : : 40
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam