ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో నెదర్లాండ్స్ మహారాణి మాగ్జిమా సమావేశం
प्रविष्टि तिथि:
25 JUN 2026 10:40PM by PIB Hyderabad
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి ద్రవ్య వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న నెదర్లాండ్స్ మహారాణి మాగ్జిమా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దీనిపై ప్రధానమంత్రి వివరిస్తూ- “దేశమంతటా చౌకగా, విస్తృతంగా ఆర్థిక సేవల ప్రదానంలో భారత సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల విప్లవం తోడ్పాటు సహా ఇతరత్రా అంశాలపై మేం చర్చించాం” అని పేర్కొన్నారు. ప్రపంచంలోని భాగస్వామ్య దేశాలతో ఈ అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి ద్రవ్య వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగానూ, ప్రపంచవ్యాప్త ఆర్థిక సార్వజనీనత కోసం చిరకాలం నుంచీ వివిధ అంతర్జాతీయ వేదికలపై తన గళం వినిపిస్తున్న నెదర్లాండ్స్ మహారాణి మాగ్జిమాతో సమావేశం నాకెంతో ఆనందం కలిగించింది...
భారత ప్రజానీకానికి ‘జీవన సౌలభ్యం’తోపాటు ప్రజలకు మరింత సాధికారతతో ఆర్థిక సేవల విస్తృత ప్రదానానికి సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల విప్లవం తోడ్పడిన తీరుపై మేమిద్దరం చర్చించాం...
మాతో భాగస్వామ్యంగల ప్రపంచ దేశాలతో ఈ అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. pic.twitter.com/xlbqHwHqBf
- నరేంద్ర మోదీ, (@narendramodi) 2026 జూన్ 25.
(रिलीज़ आईडी: 2278178)
आगंतुक पटल : 4