బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు గ్యాసిఫికేషన్‌పై దృష్టి సారిస్తూ స్వచ్ఛ బొగ్గు సాంకేతికతలపై బ్రిక్స్ అనుబంధ కార్యక్రమాన్ని నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ

प्रविष्टि तिथि: 24 JUN 2026 5:46PM by PIB Hyderabad

బొగ్గు గ్యాసిఫికేషన్‌పై దృష్టి సారిస్తూ స్వచ్ఛ బొగ్గు సాంకేతికతలపై బ్రిక్స్ అనుబంధ కార్యక్రమాన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిందిఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులుప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులుపరిశ్రమల ప్రముఖులుసాంకేతిక నిపుణులతో పాటు రష్యాఇథియోపియాయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈదేశాల బ్రిక్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా ప్రసంగిస్తూ.. భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయటంలోపారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వటంలో బొగ్గు గ్యాసిఫికేషన్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారుకోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గును సిన్‌ గ్యాస్‌గా మార్చవచ్చని.. దీని ద్వారా అమ్మోనియామిథనాల్హైడ్రోజన్సింథటిక్ ఇంధనాలుడీఆర్‌ఐఇతర విలువైన ఉత్పత్తులను తయారు చేయవచ్చని తెలిపారుఈ సాంకేతికత దేశీయ బొగ్గు వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటానికి తోడ్పడమే కాకదిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

విధానపరమైన మద్దతుఆర్థిక ప్రోత్సాహకాలుఖచ్చితమైన బొగ్గు సరఫరా వ్యవస్థలువివిధ మంత్రిత్వ శాఖల సమన్వయ ప్రయత్నాల ద్వారా 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ చేపట్టటమే భారత ప్రభుత్వ లక్ష్యమని శ్రీ సనోజ్ కుమార్ ఝా వెల్లడించారుప్రస్తుతం కొనసాగుతున్న వివిధ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల పురోగతిని వివరించారుస్వచ్ఛ బొగ్గు సాంకేతికతలను మరింత ముందుకు తీసుకెళ్లటంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం అవసరమని స్పష్టం చేశారు.

ఈ కార్యశాల సందర్భంగా కోల్ గ్యాసిఫికేషన్ సాంకేతికతపై బీహెచ్‌ఈఎల్‌.. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులుఈ సాంకేతికత బ్రిక్స్ దేశాలకు ఎంత ముఖ్యమో తెలిపేలా జిందాల్ స్టీల్ (జేఎస్‌ఎల్), గ్రేటా ఎనర్జీ సంస్థలు ప్రజెంటేషన్ ఇచ్చాయికస్తా అండర్‌గ్రౌండ్‌ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీప్రాజెక్టు గురించి ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్ (ఈసీఎల్‌వివరించిందియూసీజీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుబొగ్గు గనుల కేటాయింపుల గురించి నామినేటెడ్ అథారిటీ తెలిపిందికోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్అందిస్తున్న బొగ్గు సరఫరా సదుపాయాలనుఆ సంస్థ చేపట్టనున్న నూతన ప్రాజెక్టుల వివరాలను తెలియజేసింది.

కోల్ గ్యాసిఫికేషన్‌కు సంబంధించి వివిధ అంశాలపై చర్చా కార్యక్రమం జరిగిందిఇందులో భాగంగా సాంకేతికతప్రాజెక్టుల ఆర్థిక వివరాలుభౌగోళికంగానే కాకగ్యాసిఫికేషన్ ప్రక్రియలోని సవాళ్లుభారతదేశంలోని బొగ్గులో ఉండే అధిక శాతం ఫ్లైయాష్‌ను వినియోగించుకోవటంసాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలుఆర్థిక సహాయం వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.

***

 

(रिलीज़ आईडी: 2277675) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil