ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యోగాకున్న పరివర్తనాత్మక శక్తిని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 22 JUN 2026 8:13AM by PIB Hyderabad

యోగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి సాయపడమే కాకుండా,  ఆత్మవిశ్వాసంతో సానుకూల జీవితాలను గడపడానికి కూడా స్ఫూర్తిని కలిగిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం అసాధారణ విజయాన్ని సాధించడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
‘‘చిత్తప్రశమనోపాయో యోగ ఇత్యభిధీయతే ప్రాణస్పందనిరోధో వా ద్వేధా యోగస్య ధారణా’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో  ప్రధానమంత్రి పంచుకున్నారు.
మనసును శాంతింపచేసే సాధనాన్ని యోగా అని చెబుతారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే యోగా రెండు ప్రధాన పద్ధతుల్ని నిర్దేశించింది. వాటిలో ఒకటో పద్ధతి మనసును శాంతంగా ఉంచుకోవడం, రెండోది శ్వాస ప్రవాహాన్ని నియంత్రించడం అని పైన పేర్కొన్న సుభాషితం మనకు బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘యోగ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా, వారు ఆత్మవిశ్వాసంతో సానుకూల జీవితాన్ని గడిపేటట్లు స్ఫూర్తిని కూడా అందిస్తోంది.
చిత్తప్రశమనోపాయో యోగ ఇత్యభిధీయతే ప్రాణస్పందనిరోధో వా ద్వేధా యోగస్య ధారణా’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2276497) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Gujarati , Tamil , Malayalam