రక్షణ మంత్రిత్వ శాఖ
స్వదేశీ ఎయిర్ కుషన్ వాహనం చేరిక ఐసీజీ నిర్వహణ సామర్థ్యం పెంపు
प्रविष्टि तिथि:
18 JUN 2026 4:45PM by PIB Hyderabad
భారత కోస్తా తీర రక్షకదళం (ఐసీజీ) కోసం చౌగులే అండ్ కంపెనీ తయారు చేస్తున్న ఆరు స్వదేశీ ఎయిర్ కుషన్ వాహనాల్లో (ఏసీవీ) మొదటి వాహనాన్ని ఈ రోజు గోవాలో ఐసీజీలో చేర్చుకున్నారు. అనేక సముద్రయాన విధుల్లో ఐసీజీ కార్యకలాపాల సామర్థ్యాన్ని ఈ హోవర్‌క్రాఫ్ట్ పెంచడంతో పాటు, సవాళ్లకు దీటుగా స్పందించే తత్వాన్ని బలోపేతం చేయగలుగుతుంది. దీని చేరిక ఆత్మనిర్భర్ భారత్ దృష్టికోణాన్ని ప్రోత్సహించడమే కాకుండా, దేశంలో నౌకావాణిజ్య ప్రధాన పరిశ్రమల సంఖ్య ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం పెరుగుతుండటానికి నిదర్శనంగా కూడా నిలుస్తోంది.
ఐసీజీ సీనియర్ అధికారులు, నౌకానిర్మాణ పరిశ్రమ ప్రతినిధుల సమక్షంలో ఈ ఎయిర్ కుషన్ వాహనాన్ని చేర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ నౌకావాణిజ్య ప్రయోజనాలను రక్షించాల్సిన తన కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఊతంగా నిలిచే ఆధునికీకరణ, సామర్థ్యాల పెంపు అంశాలపై ఐసీజీ నిరంతరంగా తీసుకుంటున్న శ్రద్ధను ఈ ఏసీవీ చేరిక స్పష్టం చేస్తోంది. భారత కోస్తా తీర రక్షకదళం కోసం ఆరు ఏసీవీలను కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ఒప్పంద పత్రాలపై రక్షణ మంత్రిత్వ శాఖ, చౌగులే అండ్ కంపెనీ సంతకాలు చేశాయి.
***
(रिलीज़ आईडी: 2274745)
आगंतुक पटल : 11