జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో మహిళ సామాజిక బహిష్కరణ


ఆమె అంత్యక్రియలకూ గ్రామస్థుల నిరాకరణపై జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా విచారణ

జరిమానా కట్టలేదని 12 ఏళ్లుగా మహిళ, ఆమె కుటుంబ సభ్యులపై సామాజిక బహిష్కరణ

ఒడిశా రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ.. ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను అందజేయాలని కమిషన్ ఆదేశం

నాడు పోస్టు చేయడమైనది: 15 JUN 2026 2:30PM by PIB Hyderabad

ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా మహుల్దిహా గ్రామంలో ఓ వృద్ధురాలు 12 ఏళ్ల పాటు సామాజిక బహిష్కరణను అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోవడం, ఆమె మరణించిన తర్వాత కూడా గ్రామస్థులు ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి కూతురికి కనీస సహాయం అందించకపోవడంపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. మీడియాలో వచ్చిన ఈ కథనాన్ని కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. చివరకు స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి కొన్ని స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారంతో వృద్ధురాలి అంత్యక్రియలను పూర్తి చేసింది.

వార్తా కథనాల్లోని అంశాలు నిజమైతే, అవి స్పష్టంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయని కమిషన్ పేర్కొంది. ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

2026, జూన్ 11న వెలువడిన మీడియా కథనం ప్రకారం.. వృద్ధురాలి కుమార్తె గతంలో వేరే కులానికి చెందిన వ్యక్తితో కొంతకాలం పాటు ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఈ కారణంతో గ్రామస్థులు ఆ కుటుంబానికి జరిమానా విధించారు. ఆ జారిమానాను చెల్లించలేకపోవడంతో గ్రామస్థులంతా కలిసి ఆ వృద్ధురాలి కుటుంబాన్ని ఏకంగా 12 సంవత్సరాల పాటు సామాజికంగా బహిష్కరించారు.

***


(రిలీజ్ ఐడి: 2273013) సందర్శకుల సూచీ సంఖ్య : : 77
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil