రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హీరో మోటోకార్ప్ - తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిల్‌ ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగం


శుద్ధమైన, స్వయం సమృద్ధమైన రవాణా వ్యవస్థ దిశగా సాధించిన కీలకమైన విజయమే ఫ్లెక్స్ ప్యూయల్ మొబిలిటీ: శ్రీ నితిన్ గడ్కరీ

प्रविष्टि तिथि: 03 JUN 2026 10:15PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన హీరో మోటో కార్ప్ తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిల్ ఆవిష్కరణలో కేంద్ర రోడ్డు రవాణాజాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీకేంద్ర పెట్రోలియంసహజవాయు మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ ప్రసంగించారు.

ఈ మార్గదర్శక కార్యక్రమాన్ని చేపట్టిన బృందానికి శ్రీ నితిన్ గడ్కరీ అభినందనలు తెలియజేశారుస్వచ్ఛమైనస్వయం సమృద్ధి సాధించినసుస్థిరమైన రవాణా కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా ఉన్న భారత్ ఫ్లెక్స్-ఫ్యూయల్ రవాణా దిశగా మారడంలో అగ్రగామిగా ఉండేందుకు తగిన స్థానంలో ఉందని మంత్రి అన్నారుఈ సాంకేతికత పరిజ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలను 77 శాతం తగ్గించవచ్చనీదిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చనీరూ.1.44 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చనీ ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంత ఇంధన భద్రతను బలోపేతం చేస్తుందనీబయోఫ్యూయల్ డిమాండును పెంచుతుందనీరైతులకు తోడ్పాటు అందిస్తుందనీవ్యర్థాల నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందనీఉపాధి అవకాశాలను కల్పిస్తుందనీ శ్రీ గడ్కరీ స్పష్టం చేశారు.

భాగస్వాములందరి మధ్య బలమైన సహకారంసమన్వయ ప్రయత్నాల ద్వారా సాధ్యమైన ఈ ప్రారంభోత్సవంఆటోమోటివ్ రంగంపర్యావరణంఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన విజయాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది.

***


(रिलीज़ आईडी: 2268887) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी