కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ ఇన్‌స్ట్రుమెంట్’ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) సరళీకరణ


కంపెనీల చట్టం-2013 షెడ్యూల్-VII పరిధి విస్తరణ ద్వారా వెసులుబాటు కల్పించిన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ

నిబంధన-2 కింద నిర్వచనంతో.. రూల్‌-4ఎని చేర్చిన నేపథ్యంలో ‘జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ ఇన్‌స్ట్రుమెంట్’ ద్వారా నిధులను సమీకరించే ‘లాభాపేక్ష రహిత సంస్థ’లే ప్రాజెక్టు అమలు-మూల్యాంకన బాధ్యతను స్వీకరిస్తాయి

प्रविष्टि तिथि: 29 MAY 2026 7:43PM by PIB Hyderabad

   వికసిత భారత్ దృక్కోణానికి అనుగుణంగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) “సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ ఇన్‌స్ట్రుమెంట్‌ సబ్‌స్క్రిప్షన్‌” పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇందుకోసం కంపెనీల చట్టం-2013లోని షెడ్యూల్-VII పరిధిని విస్తరిస్తూ, సరికొత్త అంశం నం.(xiii) ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)ను సరళీకరించింది. అలాగే, ‘జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్’ ద్వారా ‘సీఎస్‌ఆర్‌’  అమలు సౌలభ్యం దిశగా ‘సీఎస్‌ఆర్‌ నిబంధనలు-2014’లో సవరణ చేసింది. ఈ సవరణ కింద నిబంధన-2లో ‘లాభాపేక్ష రహిత సంస్థ’, ‘జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్’ నిర్వచనాలను చేర్చింది. దీనిద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత అమలుకు తగిన ప్రమాణాలను ‘నిబంధన-4ఎ’ లో పొందుపరచింది.

కంపెనీలు నిబంధనలను పాటించడంలో ఈ సవరణ గణనీయ సౌలభ్యం కల్పిస్తుంది. దీంతోపాటు ప్రజా సంక్షేమ ప్రాజెక్టుల కోసం లాభాపేక్ష రహిత సంస్థలు (ఎన్‌పీఓ) పారదర్శకంగా, నియంత్రిత విధానంలో నిధులను సమీకరించేందుకు దోహదం చేస్తుంది. ఈ మేరకు ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-సెబి’ నిబంధనలకు అనుగుణంగా ఈ ‘ఎన్‌పీఓ’లు ‘సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’ (ఎస్‌ఎస్‌ఈ)లో ‘జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్‌’ను జారీ చేయగలుగుతాయి.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)ను తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన సంస్థలు అందుకోసం వెచ్చించే మొత్తం సంబంధిత ఆర్థిక సంవత్సరానికయ్యే మొత్తం ‘సీఎస్‌ఆర్‌’ వ్యయంలో 10 శాతానికి మించకూడదు.

కంపెనీల చట్టం-2013 (‘చట్టం’)లోని సెక్షన్ 135, షెడ్యూల్-VII సహా కంపెనీల (కార్పొరేట్ సామాజిక బాధ్యత విధానం) నిబంధనలు-2014 కింద కార్పొరేట్ సామాజిక బాధ్యతకు సంబంధించిన ఈ చట్టపరమైన నిబంధనలను పొందుపరచారు. సార్వజనీన, సుస్థిర ప్రగతిని ప్రోత్సహించడంలో జాతీయ ప్రాథమ్యాలకు అనుగుణంగా సీఎస్‌ఆర్‌ కింద చేపట్టే కార్యకలాపాలను షెడ్యూల్-VII వివరిస్తుంది.

సంబంధిత సవరణ నోటిఫికేషన్లను (గెజిట్ నోటిఫికేషన్ నం. జి.ఎస్.ఆర్. 415 (ఇ), జి.ఎస్.ఆర్ 416 (ఇ.).. తేదీ 27.05.2026) కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (M/o కార్పొరేట్ అఫైర్స్) వెబ్‌సైట్‌ (www.mca.gov.in)లో చూడవచ్చు.

లింకులు:

 

***


(रिलीज़ आईडी: 2267155) आगंतुक पटल : 40
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी